దర్శి: పాలకులు, అధికారులు నిర్లక్ష్యం ఫలితంగా సాగర్ జలాలు కలుషితమవుతున్నాయి. ఆ నీళ్లు తాగిన ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. అయినా పట్టించుకోకుండా వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీలోని చెత్త, మురుగు, డంపింగ్ మొత్తం సాగర్ కాలువ కట్ట పైనే వేస్తున్నారు. శివరాజనగర్ కొండ పక్కన కాలువకు మధ్యలో ఈ డంపింగ్ చేస్తుండడంతో ఆ ప్రాంతం మొత్తం చెత్తతో కలసిపోయి కాలువ కట్టపైకి డంపింగ్ మొత్తం పేరుకుంటూ వచ్చింది. ఈ కాలువ కట్టవద్దకు వెళ్లాలంటే ఎవరైనా సరే ముక్కు మూసుకున్నా భరించలేని వాసన వెదజల్లుతోంది. వర్షం కురిస్తే ఆ చెత్తలో కుళ్లిన వ్యర్ధాలు, మురుగు నీరు మొత్తం కొట్టుకునిపోయి సాగర్ కాలువలోకి నేరుగా వెళ్తున్నాయి. కాలువ పైన వేసిన డంపింగ్ వ్యర్థాలు సైతం కొట్టుకుని వచ్చి సాగర్ కాలువలో కలిసిపోతున్నాయి. దీంతో ఆ జలాలు పూర్తిగా కలుషితమవుతున్నాయి. ఈ సాగర్ జలాలను దర్శి నుంచి ముండ్లమూరు, తాళ్లూరు, రామతీర్థం, చీమకుర్తి, సంతనూతల పాడు, ఒంగోలుకు నేరుగా తరలిస్తున్నారు. ఆయా మండలాల్లోని తాగునీటి చెరువులకు ఈ నీరు వెళుతోంది. దర్శి నియోజకవర్గంలో సుమారు రెండు లక్షల మందికి ఈ నీటిని కుళాయిలు ద్వారా సరఫరా చేసే ఎన్‌ఏపీ రిజర్వాయర్‌కు కూతవేటు దూరంలో ఈ డంపింగ్ ఉండడం గమనార్హం. అక్కడ పనిచేస్తున్న ఎన్‌ఏపీ సిబ్బంది సైతం మురుగు కంపు భరించలేక పోతున్నామని మేం చేసేదేం లేక ఆనీటిని అలాగే పంపింగ్ చేస్తున్నామని చెప్తున్నారు.
సాగర్ కాలువలో కలుస్తున్న డంపింగ్ వ్యర్థాలు, కవర్లు
సాగర్ కాలువ కట్టపైన ఉన్న నగర పంచాయతీలోని డంపింగ్ చెత్త వ్యర్థాలు
సాగర్ కాలువలో నీటిని మోటార్లు ద్వారా ఎన్‌ఏపీ రిజర్వాయర్‌కు పంపిణీ చేస్తున్న దృశ్యం
కలుషితమవుతున్న సాగర్ జలాలు
దర్శి నగర పంచాయతీలోని డంపింగ్ మొత్తం సాగర్ కాలువ కట్టపైనే
ప్రకాశం జిల్లాలోని పలు మండలాలకు, ఒంగోలు నగరానికి ఈ నీటినే సరఫరా
తాగునీటి అవసరాలకు వినియోగిస్తున్న వైనం
ప్రాణాలతో చెలగాటం
ప్రాణాలతో చెలగాటం
ప్రాణాలతో చెలగాటం
ప్రాణాలతో చెలగాటం