
‘సాక్షి’పై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలి
కీలకమైన పత్రికా వ్యవస్థపై కూటమి ప్రభుత్వం కక్ష కట్టడం దారుణం. ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తున్నారన్న కోపంతో సాక్షి పత్రిక ఎడిటర్ ధనుంజయరెడ్డితోపాటు ఇతర రిపోర్టర్లపై రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలి. ప్రజాస్వామ్యంలో పత్రికలపై కేసులు పెట్టడం మంచి సాంప్రదాయం కాదు. పత్రికా వ్యవస్థను గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. పాలకులకు నచ్చని వార్తలొస్తే ఖండన ఇవ్వొచ్చు. అంతేకానీ ఇలా వరుసగా కేసులు పెట్టడం ప్రజాస్వామ్యంలో మంచిదికాదు.
– జంకె వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నెల్లూరు పార్లమెంట్ పరిశీలకుడు

‘సాక్షి’పై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలి