
అంతర్జాతీయ ఫెన్సింగ్ పోటీలకు ఇద్దరు బాలికలు
ఒంగోలు: అంతర్జాతీయ స్థాయి ఫెన్సింగ్ పోటీలకు జిల్లాకు చెందిన ఇద్దరు బాలికలు ఎంపికయ్యారు. ఇటీవల ఉత్తరాఖండ్ రాష్ట్రం హల్ద్వానిలో నిర్వహించిన జాతీయ స్థాయి అండర్ 17 (క్యాడెట్) పోటీల్లో చెరువుకొమ్ముపాలేనికి చెందిన పూసపాటి లిఖితారెడ్డి, చీమకుర్తికి చెందిన పుత్తూరి చక్రిక సత్తా చాటారు. అంతర్జాతీయ పోటీలకు ఏపీలోని పశ్చిమ గోదావరి నుంచి నలుగురు, కర్నూలు నుంచి ముగ్గురు, ప్రకాశం నుంచి ఇద్దరు ఎంపికయ్యారు. వీరికి ప్రస్తుతం ఢిల్లీలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఈనెల 19 నుంచి ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానిలో నిర్వహించనున్న అంతర్జాతీయ(ఏషియన్ ఫెన్సింగ్) పోటీల్లో వీరు దేశం తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. ఎంపికై న బాలికలతోపాటు కోచ్ రాజును జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు వి.నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి జీఎస్‌వీ కృష్ణమోహన్, జిల్లా కార్యదర్శి జి.నవీన్, ఒలంపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కుర్రా భాస్కరరావు ప్రత్యేకంగా అభినందించారు.