
ప్రభుత్వమే నిర్వహించాలి
మార్కాపురం మెడికల్ కాలేజీని
మార్కాపురం టౌన్: మార్కాపురం మెడికల్ కాలేజీని పీపీపీ పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే నిర్ణయాన్ని విరమించుకోవాలని, ప్రభుత్వమే కాలేజీని నిర్వహించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎస్‌కే మాబు డిమాండ్ చేశారు. సీపీఎం బృందం ఆదివారం సాయంత్రం మెడికల్ కాలేజీని సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పశ్చిమ ప్రాంతానికి మెడికల్ కాలేజీ అత్యంత అవసరమన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో మెడికల్ కాలేజీని పూర్తి చేస్తామని హామీ ఇచ్చి మాటతప్పిందన్నారు. యర్రగొండపాలెం, గిద్దలూరు, మార్కాపురం, దర్శి, కనిగిరి ప్రాంతాల్లోని పేద, దళిత, గిరిజన ప్రజలకు వైద్యం అందుబాటులోకి రావాలంటే మెడికల్ కాలేజీ అవసరమన్నారు. పీపీపీ విధానం వల్ల కాలేజీ ప్రైవేట్ పరమైతే అన్ని రకాల వైద్యసేవలకు డబ్బు చెల్లించాల్సి వస్తుందన్నారు. కాలేజీ పేరుతో జరుగుతున్న రాజకీయాలను ఆపి నిర్మాణంపై దృష్టిపెట్టాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు సోమయ్య, పట్టణ కార్యదర్శి రఫీ, మండల కార్యదర్శి బాలనాగయ్య, రూబెన్, నన్నేసా, రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం నాయకుల డిమాండ్
పీపీపీ విధానంతో పేదలకు తీవ్ర నష్టమని ఆందోళన