
రాష్ట్ర స్థాయి కబడ్డీ జట్ల ఎంపిక
ఒంగోలు: రాష్ట్ర స్థాయి జూనియర్ బాలబాలికల కబడ్డీ జట్లను ఆదివారం ఒంగోలులోని మినీ స్టేడియంలో ఎంపిక చేశారు. ఈ సందర్భంగా కబడ్డీ అసోసియేషన్ జిల్లా చైర్మన్ ఎన్.చంద్రమోహన్‌రెడ్డి, కార్యదర్శి కుర్రా భాస్కరరావు మాట్లాడుతూ.. బాలుర జట్టుకు కొత్తపట్నంలో, బాలికల జట్టుకు పాకలలో శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎంపిక చేసిన జట్లు ఈ నెల 22 నుంచి 25వ తేదీ వరకు ఎన్‌టీఆర్ జిల్లా గొల్లపూడిలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందని పేర్కొన్నారు. శిక్షణ శిబిరాల్లో వసతులను కబడ్డీ అసోసియేషన్ చీఫ్ ప్యాట్రన్ డాక్టర్ నల్లూరి సుబ్బారావు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అఽసోసియేషన్ కార్యదర్శి యామారపు పూర్ణచంద్రరావు, కోశాధికారి డి.రమేష్, ఉపాధ్యక్షుడు సిరిగిరి రంగారావు, గడ్డం శ్రీను, సుమతి తదితరులు పాల్గొన్నారు.
బాలుర జట్టు : రాఘవేంద్ర(కొత్తపట్నం), కె.దశరథుడు(మార్కాపురం), కె.రామకృష్ణ(గిద్దలూరు), వి.నాగచైతన్య(రాజుపాలెం), పి.వినీల్‌రెడ్డి(కొత్తపట్నం), ఆర్.అభిషేక్‌రెడ్డి(కంభం), కె.బ్రహ్మశివాజీ(వేమవరం), కె.ఆకాష్(గొట్లగట్టు), బి.హరినాథ్(మడనూరు), ఎం.లాలశివ(దోర్నాల), టి.బాబి(ఒంగోలు), జె.రామాంజనేయులు(ఈదర), బి.అయ్యప్ప(ఒంగోలు), బి.సుబ్బారెడ్డి(ఈతముక్కల), స్టాండ్‌బైలుగా పి.రుత్విక్(కనిగిరి), కె.షణ్ముఖ్‌రాజ్(ఒంగోలు), ఎస్‌కె అజ్మల్(సీఎస్‌పురం), సీహెచ్ సంతోష్(కొత్తపట్నం), ఆర్.శివనాయక్(మార్కాపురం).
బాలికల జట్టు : వి.అర్చన, కె.భూమిక, కె.నందిని, కె.త్రిపుర, కె.త్రిగుణ, కె.సౌమ్య, కె.విజయలక్ష్మి , నందిని(పాకల), డి.హసన్‌బీ, ఎన్.కాశీశ్వరి(మార్కాపురం), డి.జ్యోత్స్న(వై.డి.పాడు), ఎం.శ్రీలత(గొట్లగట్టు), ఎం.పల్లవి(కనిగిరి), కె.కీర్తన(ఒంగోలు), స్టాండ్‌బైలుగా యు.రూతు(వై.డి.పాడు), టి.నాగమణి(ఒంగోలు), కె.మహిమ(మర్రిపూడి).