
అటవీ అమరవీరుల త్యాగాలు మరువలేనివి
● ఫారెస్ట్ డీడీ సందీప్ కృపాకర్
మార్కాపురం: అటవీ అమరవీరుల త్యాగాలు మరువలేనివని అటవీశాఖ డిప్యూటీ డైరెక్టర్ జి.సందీప్ కృపాకర్ పేర్కొన్నారు. గురువారం అటవీ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా స్థానిక అటవీశాఖ కార్యాలయంలో అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ డీడీ మాట్లాడుతూ.. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తూ స్మగ్లర్ల చేతిలో అటవీ సిబ్బంది చనిపోయారన్నారు. ప్రాణత్యాగం చేసిన వారి సేవలను ఆదర్శంగా తీసుకుని సిబ్బంది పనిచేయాలని సూచించారు. విధి నిర్వహణలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. కార్యక్రమంలో ఎఫ్‌ఆర్‌ఓ పిచ్చిరెడ్డి, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్లు నాగరాజు, ప్రసాద్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
కురిచేడు: మండలంలోని ఆవులమంద గ్రామం నుంచి 30 మందితో త్రిపురాంతకం మండలం ఇసుక త్రిపురాంతకం గ్రామానికి వెళుతున్న టాటా ఏస్ వాహనం మండలంలోని పాత నాంచారపురం గ్రామం వద్ద తిరగబడింది. ఈ ఘటనలో 18 మందికి స్వల్పగాయాలు కాగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో పల్లె సామ్రాజ్యానికి తలకు బలమైన గాయం కాగా, పల్లె అంకమ్మకు చేయి నుజ్జునుజ్జయింది. వారిని స్థానిక ప్రైవేటు వైద్యశాలలో ప్రథమ చికిత్స చేసి అనంతరం 108 వాహనాల్లో వినుకొండకు మెరుగైన వైద్యం కోసం తరలించారు.

అటవీ అమరవీరుల త్యాగాలు మరువలేనివి

అటవీ అమరవీరుల త్యాగాలు మరువలేనివి