
గిరిజన ప్రజా చైతన్య యాత్ర పోస్టర్ ఆవిష్కరణ
ఒంగోలు వన్‌టౌన్: గిరిజన ప్రజా చైతన్య యాత్ర గోడ పత్రికను రాష్ట్ర ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు, గిరిజన ప్రజా సమాఖ్య జాతీయ అధ్యక్షుడు వడిత్యా శంకర్ నాయక్ గురువారం ఆవిష్కరించారు. ఒంగోలులోని ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ కార్యాలయంలో గిరిజన సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 28వ తేదీన జిల్లాలోని అన్ని గిరిజన సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన చైతన్య యాత్ర ఇప్పటికే మూడు జిల్లాలో పూర్తయిందన్నారు. స్వాతంత్య్రం వచ్చి 79 ఏళ్లు గడిచినా గిరజనుల బతుకులు ఏ మాత్రం మారలేదన్నారు. గిరిజనుల హక్కులను కాపాడుకునేందుకు ఏక తాటిపై కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో గిరిజన సంఘాల నాయకులు ఆర్.సైదా నాయక్, పి.సత్యం, ఆర్.హనుమానాయక్, ఎ.కోటి నాయక్, హరినాయక్, ఎ.శ్రీను నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఈ నెల 28న జిల్లాలో గిరిజన సంఘాల సదస్సు
గిరిజన ప్రజా సమాఖ్య జాతీయ అధ్యక్షుడు వడిత్యా శంకర్ నాయక్ వెల్లడి