
మాతా, శిశు మరణాలు నివారించాలి
● వైద్యశాఖాధికారులతో సమీక్షలో కలెక్టర్
ఒంగోలు సబర్బన్: మాతృ, శిశు మరణాలను నివారించడానికి ప్రతీఒక్కరూ ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా వైద్యాధికారులను ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ఎండీఆర్ సమావేశంలో ఏప్రిల్, మే, జూన్ నెలల్లో జిల్లాలో సంభవించిన మాతృ, శిశు మరణాలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ మూడు నెలల కాలంలో ఒక బాలింత మృతి చెందినట్లు అధికారులు వివరించగా, మృతికి కారణాలపై కలెక్టర్ ఆరా తీశారు. ప్రభుత్వ వైద్యాధికారుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఆయా ఆస్పత్రుల్లో ఉన్న వసతులు, వైద్యుల గురించి ప్రశ్నించారు. బాలింత మృతిపై వైద్యారోగ్య శాఖ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేసి సమగ్ర నివేదికను అందజేయాలని కలెక్టర్ వైద్యాధికారులను ఆదేశించారు. అనంతరం గర్భాశయ శస్త్రచికిత్సలపై కలెక్టర్ సమీక్షించారు.