
చిన్నారులకు విద్య తప్పనిసరి
● జిల్లా న్యాయసేవాఽధికార సంస్థ కార్యదర్శి ఇబ్రహీం షరీఫ్
ఒంగోలు: చిన్నపిల్లలకు చదువు తప్పనిసరి అని, బాలబాలికలు ఏదో ఒక విద్యా సంస్థలో చదవాలని జిల్లా న్యాయసేవాఽధికార సంస్థ కార్యదర్శి షేక్ ఇబ్రహీం షరీఫ్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో లీగల్ సర్వీస్ టు చిల్డ్రన్ అంశంపై జిల్లా అధికారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి షేక్ ఇబ్రహీం షరీఫ్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్క ప్రభుత్వ విభాగం తమ పరిధిలో బాల్య వివాహాల నిర్మూలనకు, విద్యార్థులకు సరైన వైద్య సదుపాయాలు అందించేందుకు, మెరుగైన వైద్య సదుపాయం కల్పించేందుకు యత్నించాలన్నారు. మెరుగైన బాల సమాజానికి సహకరించాలని బాలుర కోసం సేవలు అందించే స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులకు సూచించారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమశాఖ ఉప సంచాలకులు లక్ష్మానాయక్, కార్మిక ఽశాఖ అధికారులు ఎలిజబెత్, పవన్‌కుమార్, వైద్య శాఖ అధికారులు డాక్టర్ భగీరథి, సీడబ్ల్యూసీ చైర్మన్ రామాంజనేయులు, ఇతర జిల్లా అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కట్టా శ్రీనివాసరావు, వాసాని అంకబాబు, పీర్‌బాషా పాల్గొన్నారు.