ఒంగోలు టౌన్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌కు 49 ఫిర్యా దులు వచ్చాయి. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాదితులు పోలీసు అధికారులను నేరుగా కలిసి తమ సమస్యలు విన్నవించుకున్నారు. బా ధితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించిన పోలీసు అధికారులు ఆయా పోలీసు స్టేషన్ అధికారులకు పోన్ చేసి చట్టపరిధిలో బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీటీసీ ఇన్‌స్పెక్టర్ షమీముల్లా, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ పాండురంగారావు, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఎస్సై జనార్దన్‌రావు పాల్గొన్నారు.
చెన్నకేశవుని హుండీ ఆదాయం రూ.12.45 లక్షలు
మార్కాపురం టౌన్: శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీచెన్నకేశవస్వామి హుండీ ఆదాయం రూ.12.45 లక్షలు వచ్చిందని ఈఓ జి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సోమవారం చెన్నకేశవస్వామి ఆలయంలో 4 నెలల 16 రోజులకుగానూ హుండీ కానుకలు లెక్కించినట్లు తెలిపారు. కార్యక్రమంలో దేవదాయశాఖ పర్యవేక్షకులు సీహెచ్ వేణుగోపాల్‌రావు, రాజ్యలక్ష్మి సేవా సంఘం భక్త మహిళా సమాజం, అర్చక సిబ్బంది పాల్గొన్నారు.

పోలీసు గ్రీవెన్స్‌కు 49 ఫిర్యాదులు