
ఉల్లాస్ అక్షర ఆంధ్రపై శిక్షణ
తర్లుపాడు: ఉల్లాస్ అక్షర ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛంద ఉపాధ్యాయులకు స్థానిక వెలుగు కార్యాలయంలో శనివారం శిక్షణ ఇచ్చారు. ఎంఈఓ–2 అచ్యుత సుబ్బారావు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అక్షరాస్యత అవసరాన్ని స్వచ్ఛంద ఉపాధ్యాయులకు ఆయన వివరించారు. అవసరమైన పాఠశాలల్లో స్వచ్ఛంద ఉపాధ్యాయులను వినియోగించుకుంటామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పర్యవేక్షకుడు వెంకటరెడ్డి అధికారులను కోరారు. ఆర్థిక అక్షరాస్యత, డిజిటల్ అక్షరాస్యత గురించి వారికి వివరించారు. నిరక్షరాస్యులందరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని ఏపీఎం రమేష్ ఉపాధ్యాయులను కోరారు. కార్యక్రమంలో మహిళా సమైక్య సభ్యులు, వెలుగు, సీసీలు, వీఓఏలు, పాల్గొన్నారు.