
వైఎస్సార్ సీపీ రాష్ట్ర రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెం
ఒంగోలు సిటీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా యెనుముల మారుతి ప్రసాద్ రెడ్డి (బన్ని)ని నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. జోన్–4 కింద ప్రకాశం జిల్లా, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, అన్నమయ్య జిల్లా, చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లాలకు ఆయన్ను నియమించారు. కనిగిరికి చెందిన వైఎం.ప్రసాద్‌రెడ్డి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో రాష్ట్ర ఎన్‌ఎస్‌యూఐ కోఆర్డినేటర్‌గా పనిచేశారు. రాష్ట్ర యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా పనిచేశారు. 2001 సంవత్సరంలో జెడ్పీటీసీ గా గెలుపొందారు. వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్రలో చురుకుగా పాల్గొన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్పుయాత్ర నుంచి ఆయన వెంటే నడిచారు. వైఎం.ప్రసాద్‌రెడ్డి భార్య యొనుముల సరిత ఏఎంసీ చైర్మన్ గా పనిచేశారు. డీసీసీబీ చైర్మన్ గా వై.ఎం.ప్రసాద్‌రెడ్డి పనిచేశారు. తనపై నమ్మకంతో ఈ పదవి ఇచ్చినందుకు మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రసాద్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. రైతుల తరఫున పోరాడి పార్టీ పటిష్టతకు కృషి చేస్తానని తెలిపారు.
ఒంగోలు సిటీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా (ఒంగోలు పార్లమెంట్) కేవీ రమణారెడ్డి, వై వెంకటేశ్వరరావు, బొట్లరామారావు, కసుకుర్తి ఆదెన్నలను నియమించినట్టు పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది. కేవీ రమణారెడ్డికి గిద్దలూరు, యర్రగొండపాలెం, వై వెంకటేశ్వరరావుకు ఒంగోలు, కొండపి, బొట్ల రామారావుకు దర్శి, సంతనూతలపాడు, కసుకుర్తి ఆదెన్నకు కనిగిరి, మార్కాపురం నియోజకవర్గాలు కేటాయించారు. వీరు కేంద్ర కార్యాలయంతో సమన్వయం చేసుకుంటూ రీజినల్ కోఆర్డినేటర్, పార్లమెంట్ పరిశీలకులకు సహాయకారిగా వ్యవహరిస్తారని పేర్కొంది.
మార్కాపురం: మార్కాపురం పట్టణంలోని షణ్ముఖ ట్రేడర్స్‌లో అనుమతిలేకుండా విక్రయానికి సిద్ధంగా ఉన్న 10–26–26 రకం 89 బ్యాగుల ఎరువుల అమ్మకాలను నిలిపివేసినట్లు మార్కాపురం ఏఓ బుజ్జిబాయి తెలిపారు. దీని విలువ రూ.1,60,200 అని ఆమె తెలిపారు. ఎవరైనా వ్యాపారులు అనుమతిలేకుండా ఎరువులు విక్రయిస్తే సీజ్ చేస్తామని హెచ్చరించారు.
ఒంగోలు సిటీ: జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈ నెల 12వ తేదీ శుక్రవారం ఉదయం 10.30 గంటలకు పాత జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరం (సౌత్ బైపాస్‌రోడ్డు)లో జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ అధ్యక్షతన నిర్వహించనున్నట్లు జెడ్పీ సీఈఓ చిరంజీవి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరు కావాలని కోరారు.
ఒంగోలు: హెచ్‌ఐవీ/ఎయిడ్స్ నియంత్రణ అవగాహన కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎయిడ్స్ నియంత్రణ విభాగం, వైద్య ఆరోగ్యశాఖ, జిల్లా క్రీడాశాఖ, రెడ్ రిబ్బన్ క్లబ్ సంయుక్తంగా 17 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన విద్యార్థులకు 5 కిలోమీటర్ల పరుగుపందెం (మారథాన్) నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధిశాఖ అధికారి జి.రాజరాజేశ్వరి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలు పురుషులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్ విభాగాలకు వేర్వేరుగా జరుగుతాయి. ఒక్కో విభాగంలో ప్రథమ విజేతకు రూ.10 వేలు, ద్వితీయ విజేతకు రూ.7 వేలు చొప్పున నగదు బహుమతులు అందజేస్తారు. ఆసక్తి కలిగిన వారు ఈనెల 12న ఉదయం 6 గంటలకు స్థానిక కలెక్టరేట్ వద్ద తమ కాలేజీ ఐడీ కార్డుతో హాజరుకావాల్సి ఉంటుంది. వివరాలను ఈనెల 10వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు సెల్ నంబర్: 9493554212 కు కాల్ చేయవచ్చు.

వైఎస్సార్ సీపీ రాష్ట్ర రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెం