
పూరీ ఎక్స్‌ప్రెస్‌లో గంజాయి పట్టివేత
ఒంగోలు టౌన్: పోలీసుల తనిఖీల్లో పూరీ ఎక్స్‌ప్రెస్‌లో మరోసారి 11 కిలోల గంజాయి పట్టుబడింది. శుక్రవారం పూరీ నుంచి తిరుపతి వెళ్తున్న రైలులో స్పెషల్ పార్టీ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఒంగోలు నుంచి సింగరాయకొండ మధ్యలో తనిఖీ చేయగా, చైన్నెకు చెందిన ప్రేమ్ చంద్, సాకార్‌పేట్‌కు చెందిన మనీష్ వద్ద ఒక కిలో గంజాయి దొరికింది. అదే రైలులోని మరొక బోగీలో ఒక కిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఏడుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారణ నిమిత్తం జీఆర్‌పీ పోలీసులకు అప్పగించారు. ప్రత్యేక పోలీసుల బృందం, ఈగల్ టీం, ఆర్పీఎఫ్, జీఆర్‌పీ పోలీసులతో పాటు మాదక ద్రవ్యాలను పసిగట్టే పోలీసు జాగిలం కూడా ఈ తనిఖీల్లో పాల్గొంది. ఒంగోలు మీదుగా ప్రయాణించే పలు రైళ్లతో పాటుగా రైల్వేస్టేషన్లలోని ప్లాట్‌ఫారాలు, పార్శిల్ కేంద్రం, ప్రయాణికుల బ్యాగులను పరిశీలించారు. అనుమానిత వ్యక్తులను విచారించారు. ఈ తనిఖీలలో మహిళా పోలీసు స్టేషన్ సీఐ సుధాకర్, ఎస్సైలు శ్రీకాంత్, ఆంజనేయులు, చెంచయ్య, జీఆర్‌పీ ఎస్సై మధుసూదన్‌రావు, ఈగల్ టీం సిబ్బంది పాల్గొన్నారు.