
ఎమ్మెల్యేగారూ.. మీకిది తగునా.?
సీఎస్ పురం (పామూరు): సీఎస్ పురం మండలంలోని సి.నాగులవరం జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రాంగణం శుక్రవారం రాజకీయ వేదికగా మారింది. పాఠశాలలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవం అనంతరం చింతపూడు, చెన్నపునాయునిపల్లెకు చెందిన పలువురికి టీడీపీ కండువాలు వేసి స్థానిక ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి పార్టీలో చేర్చుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో రాజకీయ కార్యక్రమాలు నిర్వహించకూడదని ఇటీవల ఉత్తర్వులిచ్చినప్పటికీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకులు ఇలా చేయడంపై పలువురు తీవ్రంగా విమర్శిస్తున్నారు.
జెడ్పీ హైస్కూల్లో టీడీపీలోకి చేరికల కార్యక్రమం నిర్వహించిన
ఉగ్రపై తీవ్ర విమర్శలు