
నెల్లూరు పీఆర్ ఎస్‌ఈగా వైకే
టంగుటూరు: మండలంలోని అనంతవరం గ్రామానికి చెందిన యరమాల కోటేశ్వరరావు (వైకే) నెల్లూరు పంచాయతీరాజ్ విభాగం ఎస్‌ఈగా బదిలీ అయ్యారు. ఇప్పటి వరకూ ఆయన కందుకూరు ఈఈగా, ఒంగోలు ఇన్‌చార్జి ఈఈగా పనిచేశారు. వైకేకి ఇటీవల ఎస్‌ఈగా పదోన్నతి లభించి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఎస్‌ఈగా నియమితులయ్యారు. చిన్ననాటి నుంచి చదువుపై మక్కువ పెంచుకున్న ఆయన ఇంజినీరింగ్‌పై ఆసక్తితో కష్టపడి చదువుకున్నారు. ఏఈగా, డీఈగా, ఈఈగా సమర్థవంతంగా విధులు నిర్వర్తించి ప్రతీ దశలో ఉన్నతాధికారుల మన్ననలు అందుకుని ఎస్‌ఈ స్థాయికి ఎదిగారు. విధి నిర్వహణలో తన కింది స్థాయి సిబ్బంది, అధికారులను సమన్వయం చేసుకుంటూ తమ శాఖలో చక్కని ప్రతిభ కనబరిచారు. భవిష్యత్‌లో ఇంజినీర్ ఇన్ చీఫ్ స్థాయికి ఎదగాలని అనంతరం ఎంప్లాయీస్ యూనియన్ మాజీ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ కె.అనిల్‌కుమార్, కె.అంజయ్య, ప్రస్తుత అధ్యక్ష, కార్యదర్శులు ఓఎన్‌జీసీ వెంకటేశ్వర్లు, కె.చిరంజీవి, నాయకులు వై.జయబాబు, వై.కృష్ణారావు, వై.రాజు, వై.ఎలీషా ఆశాభావం వ్యక్తం చేస్తూ అభినందించారు. వైకేని వైఎస్సార్ సీపీ అనంతవరం నాయకులు ఏవీఎస్ రాజు, శారీమందిర్ వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ కసుకుర్తి కోటేశ్వరరావు, సర్పంచ్ ఉప్పలపాటి శ్రీనివాసరాజు, సుబ్బరాజు, నాగరాజు, కె.చినబాలకోటయ్య, కె.వెంకట్రావు తదితరులు అభినందించారు.