విద్యుత్‌ లైన్‌ ఏర్పాటు నిలిపివేత | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ లైన్‌ ఏర్పాటు నిలిపివేత

Sep 3 2025 4:25 AM | Updated on Sep 3 2025 4:25 AM

విద్య

విద్యుత్‌ లైన్‌ ఏర్పాటు నిలిపివేత

విద్యుత్‌ లైన్‌ ఏర్పాటు నిలిపివేత రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి 5న టెన్నికాయిట్‌ జట్ల ఎంపిక

బేస్తవారిపేట: మండలంలోని పెంచికలపాడులో రైతుల పొలాల్లో నుంచి అక్రమంగా ఇండస్ట్రీయల్‌ అవసరాల కోసం లాగుతున్న విద్యుత్‌ లైన్‌ను నిలిపేశారు. ఈనెల 1వ తేదీన ‘విద్యుత్‌ లైన్‌ ఏర్పాటు అడ్డగింత’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. కొమరోలు మండలం ముత్తరాసుపల్లెలో మొక్కజొన్న ఇండస్ట్రీ కోసం పెంచికలపాడు నుంచి రైతుల పొలాల్లోంచి హైవేరోడ్డు పక్క నుంచి విద్యుత్‌ స్తంభాలు వేస్తున్నారు. ఈ విషయంపై రైతులు ఎటువంటి అనుమతులు లేకుండా మా పొలాల్లో విద్యుత్‌ లైన్‌ ఏలా ఏర్పాటు చేస్తారని అడ్డుకున్నారు. కలెక్టర్‌, తహసీల్దార్‌, విద్యుత్‌శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో విద్యుత్‌ లైన్‌ ఏర్పాటు పనులను నిలిపివేశారు.

కొమరోలు: బైక్‌ను గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన కొమరోలు మండలంలోని దద్దవాడ గ్రామ సమీపంలో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. గిద్దలూరు మండలం పొదలకొండపల్లె గ్రామానికి చెందిన కప్పల కొండయ్య(23) పని నిమిత్తం బేస్తవారపేట మండలం మోక్షగుండం గ్రామానికి వెళ్లాడు. తన బైక్‌పై స్వగ్రామానికి తిరిగి వస్తున్న సమయంలో దద్దవాడ గ్రామ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో కొండయ్య తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై నాగరాజు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గిద్దలూరు ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

సింగరాయకొండ: స్థానిక ఏఆర్‌సీ అండ్‌ జీవీఆర్‌ ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ ఆవరణలో ఈనెల 5వ తేదీన ఉమ్మడి ప్రకాశం జిల్లా టెన్నికాయిట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సీ్త్ర, పురుషుల అండర్‌–18 జట్లను ఎంపిక చేయనున్నట్లు అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ కె.శ్రీకాంత్‌, జిల్లా కార్యదర్శి ఎన్‌టీ ప్రసాద్‌ తెలిపారు. ఎంపికై న జట్లు ఈనెల 13, 14వ తేదీల్లో కోనసీమ జిల్లాలోని మండపేటలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. క్రీడాకారులు వయసు ధ్రువీకరణ పత్రం, ఆధార్‌ కార్డు జిరాక్స్‌ కాపీ సమర్పించాలని, వివరాలకు ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ పీడీ శంకరరావును సంప్రదించాలని సూచించారు.

విద్యుత్‌ లైన్‌ ఏర్పాటు నిలిపివేత 1
1/2

విద్యుత్‌ లైన్‌ ఏర్పాటు నిలిపివేత

విద్యుత్‌ లైన్‌ ఏర్పాటు నిలిపివేత 2
2/2

విద్యుత్‌ లైన్‌ ఏర్పాటు నిలిపివేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement