
మద్యం పేరుతో అక్రమ కేసులు తగదు
చీమకుర్తి రూరల్: మద్యంలో ఎలాంటి స్కాం లేదని తెలిసినా కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా ఎంపీ మిథున్‌రెడ్డి పై, వైఎస్సార్ సీసీ నాయకులు, కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టడం, అరెస్టులు చేయించడం తగదని మాజీ మంత్రి, సంతనూతలపాడు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జ్ మేరుగు నాగార్జున అన్నారు. మండలంలోని తొర్రగుడిపాడులో ఆదివారం ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడం, అరెస్టు చేయడం పరిపాటిగా మారిందన్నారు. ఇటీవల మంత్రి పర్యటనలో డోలా బాలవీరాంజనేయస్వామి బూచేపల్లి కుటుంబంపై రాజకీయ విమర్శలు చేయడం తగదని, జిల్లాలో అవినీతి మరక అంటని కుటుంబం బూచేపల్లి కుటుంబం అని అన్నారు. పైసా ఆశించకుండా పార్టీలకు అతీతంగా ప్రజలకు సహాయం చేసే కుటుంబం బూచేపల్లిది అన్నారు. ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షుడు పమిడి వెంకటేశ్వర్లు, ఎంపీపీ యద్దనపూడి శ్రీనివాసరావు, జెడ్పీటీసీ వేమా శ్రీనివాసరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి మన్నం శ్రీధర్‌బాబు, మాజీ వైస్ ఎంపీపీ రామసాని సూర్యం, మండల రైతు అధ్యక్షుడు నల్లూరి చంద్ర, కౌన్సిలర్ మేకల సులోచన ఎల్లయ్య, దాసరి లక్ష్మీనారాయణ, కత్తి రమణారెడ్డి, డాక్టర్ బొడ్డపాటి హరిబాబు, పులి శ్రీను, కొనికి సుబ్రహ్మణ్యం, కృష్ణమూర్తి, దేవుడు తదితరులు ఉన్నారు.
వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి ●
● యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్లూరి వెంకటేశ్వర్లు
ఒంగోలు సిటీ: వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్లూరి వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒంగోలు సీఐటీయూ జిల్లా కార్యాలయంలో యునైటెడ్ మెడికల్–హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ సమావేశం ఆదివారం నిర్వహించారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు వై.సురేష్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో తాళ్లూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తొలగించిన మగ ఆరోగ్య కార్యకర్తలను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు. రీడిప్లోయెన్‌మెంట్ విధానం వలన మహిళా ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని, దాన్ని రద్దుచేసి ఎక్కడ వేతనాలు పొందుతున్నారో అక్కడే విధులు నిర్వహించేలా చూడాలని కోరారు. ఆన్‌లైన్ వర్క్ యాప్స్ సంఖ్య తగ్గించి పనిభారం తగ్గించాలని, పీఆర్సీ, ఐ.ఆర్ ఇవ్వాలని కోరారు. సీపీఎస్ విధానం రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.శ్రీధరబాబు మాట్లాడుతూ ప్రతి పీహెచ్‌సీలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌ని నియమించాలని, గ్రామ, వార్డ్ హెల్త్ సెక్రటరీలను వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోకి తీసుకు రావాలని, వైద్య ఆరోగ్య శాఖ విధులు మాత్రమే చేయించాలని కోరారు. వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులంతా యూనియన్‌లో సభ్యత్వం తీసుకొని తమ సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పోరాటాల్లో కలిసి రావాలని పిలుపునిచ్చారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కాలం సుబ్బారావు మాట్లాడుతూ ఈ ఏడాది డిసెంబర్ 31 నుంచి 2026 జనవరి 4వ తేదీ వరకు విశాఖపట్నంలో నిర్వహించే సీఐటీయూ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్.ఎల్.హెచ్.పి సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. సమావేశంలో యూనియన్ నాయకులు బెజవాడ వెంకటేష్, ఎం.నాయక్, పి.కుమారి తదితరులు పాల్గొన్నారు.

మద్యం పేరుతో అక్రమ కేసులు తగదు