
వర్షం కోసం ఎదురుచూపులు
జూలై మూడో వారానికై నా వర్షం పడుతుందని ఎదురుచూశాం. చిరు జల్లులు తప్ప పంటలు వేసుకునేందుకు అనుకూలమైన వర్షాలు లేవు. మార్కాపురం ప్రాంతమంతా వర్షాధారంపైనే రైతులందరం పంటలు సాగు చేసుకుంటున్నాం. పదును వాన కురిస్తే విత్తనాలు చల్లుకుంటాం. అడపా దడపా కురుస్తున్న వర్షాల వలన రైతులకు ఎటువంటి ఉపయోగం లేదు.
– లక్ష్మిరెడ్డి, రైతు, వేములకోట
మిర్చి సాగు చేయాలంటే భయంగా ఉంది
పోయిన ఏడాది మిర్చి సాగు చేశాను. గిట్టుబాటు ధర రాలేదు. దాంతో పాటు అకాల వర్షాలతో తెగుళ్లు వచ్చి దిగుబడులు కూడా తగ్గిపోయాయి. దీంతో ఈ ఏడాది మిర్చి సాగు చేయాలంటేనే భయంగా ఉంది. ఈ ఏడాది ఇంత వరకు వర్షాలు లేవు. జూలై నెలాఖరైనా పొలాల్లో విత్తనాలు చల్లలేదు. ఆలస్యంగా పంటలు సాగు చేస్తే అనుకోని తెగుళ్లు వస్తాయి. వ్యవసాయం చేయాలంటేనే భయంగా ఉంది. వర్షం పడితే పత్తి, సజ్జ వేద్దామనుకుంటున్నా.
– వెంకటేశ్వరరెడ్డి, మేకలవారిపల్లి

వర్షం కోసం ఎదురుచూపులు