ముంచే ప్రభుత్వం | - | Sakshi
Sakshi News home page

ముంచే ప్రభుత్వం

Jul 12 2025 7:21 AM | Updated on Jul 12 2025 11:05 AM

ముంచే

ముంచే ప్రభుత్వం

మంచి ప్రభుత్వం కాదు

రీకాల్‌ చంద్రబాబు మేనిఫెస్టో, బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీపై క్యూఆర్‌ కోడ్‌ను ఆవిష్కరిస్తున్న ఆర్కే రోజా, కారుమూరి నాగేశ్వరరావు, ఆదిమూలపు సురేష్‌, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, సతీష్‌రెడ్డి, బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, వెంకాయమ్మ, బత్తుల బ్రహ్మానందరెడ్డి, తూమాటి మాధవరావు తదితరులు

కొండపి: రాష్ట్రంలో ప్రస్తుతం మంచి ప్రభుత్వం లేదని, ప్రజలను ముంచే ప్రభుత్వం మాత్రమే ఉందని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. కొండపిలో శుక్రవారం మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అధ్యక్షతన రీకాల్‌ చంద్రబాబు మేనిఫెస్టో, బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీపై వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలతో నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా వచ్చిన రోజా మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు, సామాన్య ప్రజలే లక్ష్యంగా దాడులకు తెగబడుతూ కూటమి ప్రభుత్వం అరాచకాలు సృష్టిస్తోందని విమర్శించారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేశామని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పే ధైర్యం కూటమి నాయకులకు ఉందా అని ప్రశ్నించారు. రెడ్‌బుక్‌ రాజ్యాంగం అంటూ ఎగిరి పడితే రాబోవు రోజుల్లో ప్రజలు ఎగరేసి తంతారని విమర్శించారు. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌, లోకేష్‌ తోడు దొంగల్లాగా తయారై రాష్ట్రంలో ఎన్నో అరాచకాలు, అత్యాచారాలు హత్యలు జరుగుతున్నా అవేమీ తమకు పట్టవంటూ వ్యవహరిస్తున్నారన్నారు. ప్రశ్నించడానికి పార్టీ స్థాపించానని బీరాలు పలికిన పవన్‌ కళ్యాణ్‌ నేడు పవర్‌ లేని స్టార్‌ గా మిగిలిపోయాడని విమర్శించారు.విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉండాలో మాజీమంత్రి ఆదిమూలపు సురేష్‌ని చూసి నేర్చుకోవాలని.. ఏ విధంగా ఉండకూడదో నారా లోకేష్‌ని చూస్తే తెలిసిపోతుందన్నారు.

యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు పవన్‌ కళ్యాణ్‌, ఎల్లో మీడియా టార్గెట్‌ జగన్‌ అన్నారు. జగనన్న పై కేసులు బనాయించి భూస్థాపితం చేస్తామనడం కూటమి నాయకుల కుట్రలకు అద్దం పడుతోందన్నారు. ఏడాది తర్వాత తల్లికి వందనం పథకాన్ని అరకొరగా అమలు చేసి ప్రజలకు ఏదో వెలగబెట్టినట్లు ఆ పథకం తన కుమారుడు లోకేష్‌ కనిపెట్టినట్లు చంద్రబాబు చెప్పుకోవడం ఆయన చేతగానితనానికి నిదర్శనం అన్నారు. కల్తీ మద్యం తయారుచేసి వారి బతుకులతో ఆడుకుంటున్నారన్నారు. ఈరోజు మద్యం సీసాలకు పవర్‌ స్టార్‌ పేరు పెట్టడం వలన పవన్‌ కళ్యాణ్‌ ప్రశ్నించకుండా మిన్నకుండిపోయారన్నారు. చంద్రబాబు మూడు మాటలు మాట్లాడితే వాటిలో రెండు అబద్ధాలు..ఒకటి సొల్లు అని విమర్శించారు.

మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ రీజినల్‌ కో ఆర్డినేటర్‌ కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయవచ్చని చెప్పిన చంద్రబాబు నేడు ఉచిత బస్సును జిల్లాకే పరిమితం చేయడం మరోసారి మహిళలు మోసం చేయడమేమన్నారు. వేల కోట్ల విద్యుత్‌ చార్జీలు పెంచి పేద ప్రజలపై ఆర్థిక భారం మోపి ఆ నేరాన్ని వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం పై వేయటానికి చంద్రబాబు, ఎల్లో మీడియా ప్రయత్నించడం సిగ్గుచేటన్నారు. కొండపి నియోజకవర్గంలో వైఎస్సార్‌ సీపీ జెండా ఎగిరేలా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి ఆదిమూలపు సురేష్‌కి అండగా నిలవాలన్నారు.

వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్‌ రెడ్డి మాట్లాడుతూ ప్రశ్నించిన వారిపై కేసులు బనాయించి చిత్రహింసలకు గురి చేయటం మంచి పద్ధతి కాదన్నారు. లోకేష్‌ రెడ్‌బుక్‌ మడిచి గూట్లో పెట్టి రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడాలన్నారు. వినేవాళ్లు వెధవలైతే చెప్పేవాడు చంద్రబాబు అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జగనన్న 2.0లో ఒక కన్ను ప్రజలైతే రెండవ కన్ను కార్యకర్తలేనని ఉత్సాహపరిచారు.

జగనన్న 2.0లో కార్యకర్తలకు పెద్దపీట:

జగనన్న 2.0లో కార్యకర్తలకు పెద్దపీట వేస్తున్నామని దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ బూచేపల్లి శివప్రసాద్‌ రెడ్డి అన్నారు. చంద్రబాబు రాజధాని నిర్మాణం పేరుతో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని మింగేస్తున్నారన్నారు. వైఎస్సార్‌ సీపీలోకి ఎవరెవరో వస్తుంటారు పోతుంటారని, ఎవరు పార్టీ వీడి వెళ్లినా వైఎస్సార్‌సీపీకి వచ్చిన నష్టం లేదని చెప్పారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి 2029లో జిల్లాలోని అన్ని స్థానాలను వైఎస్సార్‌ సీపీ కై వసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

ఇప్పటి వరకు ఒక లెక్క ఇక నుంచి మరో లెక్క:

కొండపి నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పటి నుంచి మరొక లెక్క అని మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ పీఏసీ సభ్యుడు, కొండపి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ అన్నారు. నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశానికి నాయకులు, కార్యకర్తలు హాజరవుతుంటే పోలీసులు అడుగడుగునా ఆంక్షలు సృష్టించారన్నారు. సమావేశాన్ని ఫెయిల్యూర్‌ చేయాలని మంత్రి స్వామి ఆదేశాలతో టీడీపీ కార్యకర్తలుగా మారిన పోలీసులు సమావేశానికి వచ్చే ప్రతి ఒక్కరినీ ఇబ్బందులకు గురిచేశారన్నారు. కొంతమంది నాయకుల కార్యకర్తల ఫోన్లను తీసుకొని బెదిరింపులకు గురి చేశారని, అయినా నాయకులు లెక్క చేయకుండా భారీ సంఖ్యలో పాల్గొన్నారని చెప్పారు. నియోజకవర్గంలో కూటమి సృష్టించే ఆగడాలకు అదుపు లేకుండా పోతోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 3 లక్షల మంది విద్యార్థుల సంఖ్య తగ్గిందంటే విద్యా వ్యవస్థ అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం పనితీరు ఇట్టే కనిపిస్తోందన్నారు. వచ్చేది జగనన్న ప్రభుత్వమేనని, ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరి పేరును మీకు నచ్చిన బుక్కులో రాసుకోండని దానికి తప్పనిసరిగా ప్రతీకారం ఉంటుందని ఆయన కార్యకర్తలకు హామీ ఇచ్చారు. కార్యకర్తలపై ఎన్ని అక్రమ కేసులు బనాయించినా వాటిని దీటుగా ఎదుర్కొంటామన్నారు.

జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మహిళలపై హామీల జల్లు కురిపించిందని, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు పూర్తి స్థాయిలో పథకాలు అమలు చేయకుండా నట్టేట ముంచిందన్నారు.

ఒంగోలు పార్లమెంట్‌ పార్టీ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానంద రెడ్డి మాట్లాడుతూ అబద్ధపు మాటలతో ప్రజలను మోసం చేసిన ఘనుడు చంద్రబాబు అన్నారు. మిర్చి, పొగాకుతో పాటు మరి కొన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పించకుండా రైతులను దగా చేశాడన్నారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ కూటమి ప్రభుత్వానికి అనుబంధ సంస్థగా మారిందన్నారు.

ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తే డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారని విమర్శించారు. పీడీసీసీ బ్యాంక్‌ మాజీ చైర్మన్‌ డాక్టర్‌ మాదాసి వెంకయ్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ అరాచక పాలనను రాష్ట్ర ప్రజలకు గమనిస్తున్నారని సరైన సమయంలో తప్పక బుద్ధి చెబుతానన్నారు బుద్ధి చెబుతారన్నారు.

కార్యక్రమంలో డాకా పిచ్చిరెడ్డి, బచ్చల కోటేశ్వరరావు, బత్తుల అశోక్‌ కుమార్‌ రెడ్డి, మారెడ్డి వెంకటాద్రి రెడ్డి, శేషారెడ్డి, మురళి, మండవ మాలకొండయ్య, వెంకటేశ్వర్‌ రెడ్డి, వేముల రమేష్‌, బొక్కిసం సుబ్బారావు, వసంతరావు, మణికంఠేశ్వర్‌ రెడ్డి, రామకృష్ణ, జెడ్పీటీసీ అరుణ వెంకటాద్రి, ఇనకొల్లు సుబ్బారెడ్డి, మసనం వెంకట్రావు, చింతపల్లి హరిబాబు, దుద్దుగుంట మల్లికార్జున్‌ రెడ్డి, పిన్నిక శ్రీనివాసులు, బెజవాడ వెంకటేశ్వర్లు, మురళి, భువనగిరి సత్యనారాయణ, ఆరు మండలాల ఎంపీటీసీలు జెడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి పార్టీలో వివిధ విభాగాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ముంచే ప్రభుత్వం1
1/4

ముంచే ప్రభుత్వం

ముంచే ప్రభుత్వం2
2/4

ముంచే ప్రభుత్వం

ముంచే ప్రభుత్వం3
3/4

ముంచే ప్రభుత్వం

ముంచే ప్రభుత్వం4
4/4

ముంచే ప్రభుత్వం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement