తప్పుల తడకగా డీఎస్సీ హాల్‌ టికెట్లు | - | Sakshi
Sakshi News home page

తప్పుల తడకగా డీఎస్సీ హాల్‌ టికెట్లు

Jun 2 2025 2:21 AM | Updated on Jun 2 2025 11:07 AM

తప్పు

తప్పుల తడకగా డీఎస్సీ హాల్‌ టికెట్లు

లబోదిబోమంటున్న అభ్యర్థులు

దర్శి (కురిచేడు): డీఎస్సీ కోసం తాము చేసుకున్న దరఖాస్తులోని వివరాలను పక్కన పెట్టి వారి ఇష్టానుసారం వివరాలు ఇచ్చారని దర్శికి చెందిన డీఎస్సీ అభ్యర్థి ఎం లక్ష్మీ మాధురి ఆందోళన వ్యక్తం చేశారు. తన విద్యాభ్యాసం అంతా గుంటూరు జిల్లాలో జరిగిందని, అందువల్ల తన దరఖాస్తులో కూడా గుంటూరు జిల్లాకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపింది. 

ప్రస్తుతం తన తండ్రి వృత్తి రీత్యా దర్శిలో నివాసముంటున్నాడని పేర్కొంది. అయితే తన హాల్‌ టికెట్లో మాత్రం తన పూర్తి చదువు ప్రకాశం జిల్లాలో చదివినట్లు వచ్చిందని ఆందోళన వ్యక్తం చేసింది. దాని వల్ల సొంత జిల్లాకు దూరం కావడమే కాకుండా సర్టిఫికెట్లు వెరిఫికేషన్‌ లోకూడా తేడా కనిపిస్తుందని తెలిపింది. ప్రభుత్వం ఈ తప్పులను సరిచేసి తనకు, తనలాంటి వారికి న్యాయం చేయాలని కోరింది.

తప్పుల తడకగా డీఎస్సీ హాల్‌ టికెట్లు 1
1/1

తప్పుల తడకగా డీఎస్సీ హాల్‌ టికెట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement