
సాగర్ పైప్‌లైన్ పనులు ప్రారంభం
మార్కాపురం టౌన్: మార్కాపురం పట్టణానికి సాగర్ నీరు అందించే పైప్‌లైన్లకు మరమ్మతులు ప్రారంభించారు. మార్కాపురం పట్టణ ప్రజల తాగునీటి కష్టాలపై ఈనెల 18న ‘పురం గొంతులో నీటి ముల్లు’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి మున్సిపల్ అధికారులు స్పందించారు. త్రిపురాంతకం మండలం దూపాడు వద్ద మార్కాపురం ఎస్‌ఎస్ ట్యాంకు ఉంది. అక్కడి నుంచి మార్కాపురం వరకు 26 కిలోమీటర్ల మేర పైపులైన్లు వేశారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఓవర్‌హెడ్ ట్యాంకులకు నింపి నీటిని సరఫరా చేయాల్సి ఉంది. అయితే ఈ పైప్‌లైన్‌కు అక్కడక్కడా లీకేజీలు ఏర్పడడటంతో నీటి సరఫరాకు తరచూ అంతరాయం కలుగుతోంది. సక్రమంగా మరమ్మతులు చేయకపోవడంతో పట్టణ ప్రజలకు 6 రోజులకు ఒకసారి తాగునీరు సరఫరా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల నీటి కష్టాలపై ‘సాక్షి’లో కథనం రావడంతో అధికారులు స్పందించి మరమ్మతుల పనులు ప్రారంభించారు.

సాగర్ పైప్‌లైన్ పనులు ప్రారంభం