
క్రీడలతో ఐకమత్యం పెంపు
● రెండు జిల్లాల స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభం
సీఎస్‌పురం(పామూరు): క్రీడలు ఐకమత్యాన్ని పెంపొందిస్తాయని వైఎస్సార్ సీపీ మైనారిటీసెల్ రాష్ట్ర కార్యదర్శి, సర్పంచ్ షేక్.ఖాదర్‌బీబుజ్జి, డాక్టర్ పి.వీరన్నగౌడ్ అన్నారు. మండలంలోని శీలంవారిపల్లె గ్రామంలో శ్రీరామనవమి పండుగ సందర్భంగా ప్రకాశం, నెల్లూరు జిల్లాల స్థాయి క్రికెట్ టోర్నమెంట్‌ను వారు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల సైతం తమ పిల్లలను ఆ దిశగానే ప్రోత్సహించాలన్నారు. క్రీడలు అంతర్గత శక్తి సామర్థ్యాలను, దేహదారుఢ్యాన్ని పెంపొందిస్తాయన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, పోటీల్లో పాల్గొనే వారు క్రీడాస్ఫూర్తితో టోర్నమెంట్‌ను విజయవంతం చేయాలన్నారు. టోర్నమెంట్‌లో 25 జట్లు తమ పేర్లను నమోదుచేసుకున్నారు. ఉపసర్పంచ్ తీకెనం బాబూరావు, ముడియాల గోపి, మాజీ ఎంపీటీసీ మునగల నారాయణరెడ్డి, సంగిశెట్టి పీరయ్యనాయుడు, కొట్టే రవీంద్ర, శ్రీనివాసులు, కదిరి రత్నం, సన్నపురెడ్డి రామకృష్ణ, షేక్.ఖాజావళి, పలువురు పాల్గొన్నారు.