Prakasam: పచ్చ దండుపాళ్యం.. | Sakshi
Sakshi News home page

Prakasam: పచ్చ దండుపాళ్యం..

Published Tue, Apr 16 2024 1:30 AM

- - Sakshi

అధికారులను లొంగదీసుకునేందుకు ఎల్లో కూటమి కుట్రలు 


పచ్చమీడియాను అడ్డం పెట్టుకుని తప్పుడు రాతలతో బెదిరింపులు  

రిమ్స్‌ ఘటనను అడ్డుపెట్టుకొని వన్‌టౌన్‌ సీఐ లక్ష్మణ్‌ను టార్గెట్‌ చేసిన దామచర్ల అండ్‌కో 

మార్గదర్శి మేనేజర్‌ భార్య కేసులో సహకరించలేదన్న అక్కసుతో తాలూకా సీఐ భక్తవత్సలరెడ్డిపై దు్రష్ఫచారం 

ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు బ్లాక్‌ మెయిల్‌ 

ఎస్పీ బదిలీతో రెచ్చిపోతున్న పచ్చగ్యాంగ్‌ 

సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి భయంతో బెంబేలెత్తుతోన్న టీడీపీ.. దండుపాళ్యం బ్యాచ్‌ కంటే దారుణంగా వ్యవహరిస్తోంది. అధికార యంత్రాంగాన్ని లొంగదీసుకుని వైఎస్సార్‌ సీపీని నియంత్రించాలనే దుగ్ధతో పచ్చ మీడియాను అడ్డు పెట్టుకుని తప్పుడు రాతలతో అధికారుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే కుట్ర చేస్తోంది. ఎన్నికల ప్రక్రియ సమీపిస్తున్న కొద్దీ పచ్చ దండు వికృత రాజకీయ క్రీడకు తెరతీసింది. అసత్య కథనాలతో బదనాం చేస్తోంది. ఎన్నికల కమిషన్‌ ఆధీనంలో పనిచేసే ఉద్యోగ వ్యవస్థనే శాశించే స్థాయికి చేరింది. ఉద్యోగులు, అధికారులు స్వేచ్ఛగా విధులు నిర్వహించకుండా ఫిర్యాదులతో లొంగదీసుకునేందుకు కుట్రలు పన్నుతోంది. శాంతి భద్రతలను కాపాడే పోలీసుల మీద పార్టీ ముద్ర వేసి వేధింపులకు గురి చేస్తోంది. నిరాధార ఆరోపణలతో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి ఇబ్బందులు పెడుతోంది.

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఎన్నికల కమిషన్‌ వ్యవస్థనే శాశించే స్థాయిలో జిల్లా టీడీపీ నేతల వ్యవహార శైలి ఉంది. రానున్న ఎన్నికల్లో ఉద్యోగులు, అధికారులను అడ్డగోలుగా టీడీపీకి సపోర్టు చేయాలనే విధంగా బ్లాక్‌ మెయిల్‌ రాజకీయాలకు తెర తీసింది. తమకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటే ఒకలా.. లేదంటే రోజుకో రకంగా ఆరోపణలు చేస్తూ, ఎల్లో మీడియా వేదికగా అసత్య కథనాలు వండి వారుస్తోంది. తమ మాట వింటే సరి లేదంటే ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామంటూ బెదిరింపులకు దిగుతోంది. నగరంలో ఇటీవల సమతానగర్‌ వివాదాన్ని అడ్డం పెట్టుకుని పోలీస్‌ అధికారులపై ఒత్తిడి చేస్తోంది.

ఒంగోలు సమతానగర్‌లో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు శ్రీకావ్య పట్ల టీడీపీకి చెందిన నాయకులు దురుసుగా ప్రవర్తించడమే కాకుండా పక్కా ప్లాన్‌ ప్రకారం ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకోవడం తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన దాడిలో ఒక గర్భిణితో పాటుగా పలువురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు గాయపడ్డారు. చికిత్స కోసం జీజీహెచ్‌కు వెళ్లిన వారిని పరామర్శించిన బాలినేని ఇంటికి వెళ్లి పోయారు. అనంతరం జీజీహెచ్‌కు వచ్చిన దామచర్ల జనార్దన్‌ క్యాజువాలిటీలో చికిత్స పొందుతున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తల దగ్గరకు వెళ్లి మీ అంతు చూస్తానంటూ బెదిరింపులకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న బాలినేని తిరిగి జీజీహెచ్‌ దగ్గరకు వచ్చారు.

సమాచారం తెలిసిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు. బాధిత కార్యకర్తలతో మాట్లాడేందుకు బాలినేని క్యాజువాలిటీలో వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల సూచనల మేరకు ఆయన వెనక్కి వచ్చేశారు. ఈ లోపు దామచర్ల జీజీహెచ్‌లో నక్కి ఉన్నట్లు తెలుసుకున్న నాయకులు, కార్యకర్తలు అతడిని బయటకు పంపించాలని నినాదాలు చేశారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు, బీఎస్‌ఎఫ్‌ బలగాలు భారీగా అక్కడకు చేరుకుని ఎలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకున్నారు. ఇదంతా జరుగుతున్న క్రమంలో అసలు ఘర్షణలకు కారణమైన దామచర్ల దొడ్డిదారిన పారిపోయాడు.

జీజీహెచ్‌ దగ్గర ముగ్గురు ఏఎస్పీల పర్యవేక్షణ
జీజీహెచ్‌ వద్ద పోలీసులు, బీఎస్‌ఎఫ్‌ బలగాలు నిర్వహించిన బందోబస్తును అడిషనల్‌ ఎస్పీ (అడ్మిన్‌) కె.నాగేశ్వరరావు, అడిషనల్‌ ఎస్పీ (క్రైం) శ్రీధర్‌రావు, ఏఆర్‌ ఏఎస్పీ అశోక్‌బాబు, ఒంగోలు డీఎస్పీ వెంకటరెడ్డి పర్యవేక్షించారు. ముగ్గురు ఏఎస్పీలు, ఒక డీఎస్పీని వదిలిపెట్టి కేవలం వన్‌టౌన్‌ సీఐ లక్ష్మణ్‌ను టార్గెట్‌ చేస్తూ పచ్చ మీడియా వార్త వండి వార్చింది. జీజీహెచ్‌ వద్ద విధ్వంసం జరిగిందని, అల్లరి మూకలను కట్టడి చేయకుండా లక్ష్మణ్‌ స్వామి భక్తి ప్రదర్శించాడంటూ తప్పుడు కథనాన్ని ప్రచురించి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు విఫలయత్నం చేసింది. నిజానికి నలుగురు ఉన్నతాధికారులు అక్కడ ఉంటే ఒక సీఐగా వారి ఆదేశాలను పాటించడం మినహా చేయగలిగిందేమీ లేదు. ఆయన సొంతంగా ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం కూడా లేదు. ఈ వివాదంలో దామచర్ల, ఎల్లో మీడియా తీరుపై ప్రజలు ఈసడించుకుంటున్నారు.

లక్ష్మణే ఎందుకు టార్గెట్‌
లక్ష్మణ్‌ జిల్లాలో సీనియర్‌ పోలీసు అధికారిగా వివిధ హోదాల్లో విధులు నిర్వహించారు. ఆయన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అధికారి. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన లక్ష్మణ్‌ను బెదిరించడం ద్వారా తన దారికి తెచ్చుకునేందుకే దామచర్ల గ్యాంగ్‌ ఆయన్ను టార్గెట్‌ చేస్తున్నారని జనం చెప్పుకుంటున్నారు. ఒక వేళ జీజీహెచ్‌ దగ్గర ఘటనలో పోలీసులు వైఫల్యం చెందితే దానికి ముగ్గురు ఏఎస్పీలు, ఒంగోలు డీఎస్పీలే కారణమవుతారు కానీ కింది స్థాయి అధికారి ఎలా కారణం అవుతాడని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఉద్దేశ పూర్వకంగానే అతనిని బదనాం చేస్తున్నారని దళిత నాయకులు, దళిత సంఘాలు మండిపడుతున్నాయి.

ఎస్పీ బదిలీతో రెచ్చిపోతున్న ఎల్లో గ్యాంగ్‌...
జిల్లా ఎస్పీగా తిరుపతి నుంచి బదిలీపై వచ్చిన పి.పరమేశ్వరరెడ్డి మీద తప్పుడు ఆరోపణతో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో ఆయన మీద వేటు వేయడం తెలిసిందే. ఈ ఘటన తరువాత తెలుగుదేశం పార్టీ నాయకులు రెచ్చిపోతున్నారు. ఏకంగా ఎస్పీనే బదిలీ చేయించాం... ఇక మీరెంత అంటూ కింది స్థాయి అధికారులను, దళిత, మైనారిటీ ఉద్యోగులను దబాయిస్తున్నారు. టీడీపీ ఆరాచకాలకు వంతపాడకపోతే మరుసటి రోజు ఎల్లో మీడియాలో వారి మీద తప్పుడు ఆరోపణలతో వార్తలను ప్రచురిస్తున్నారు. దాంతో జిల్లాలో ఉద్యోగులు ఎన్నికల విధులు నిర్వహించాలంటే భయపడిపోతున్నారు. ఈ తలనొప్పులు మాకెందుకులే అంటూ కొందరు ఉద్యోగులు అనారోగ్యం పేరుతో ఎన్నికల విధుల నుంచి తప్పించాలని అధికారులకు విన్నవించుకుంటున్నారు.

ఎస్పీ ఆఫీసు ఎదుట ధర్నా సంగతేంటి...?
సమతానగర్‌ వ్యవహారంలో దొంగే దొంగ దొంగ అంటూ గాపు కేకలు పెడుతున్న టీడీపీ ఎస్పీ కార్యాలయం ఎదుట ధర్నా చేయడం తెలిసిందే. ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కిన దామచర్ల ఎలాంటి అనుమతులు లేకుండా ర్యాలీగా వెళ్లడమే కాకుండా ఏకంగా ఎస్పీ కార్యాలయం ఎదుటే నానా హంగామా సృష్టించాడు. దీనిపై అధికారులు నోరు మెదపట్లేదు.

మార్గదర్శి మేనేజర్‌ భార్య చోరీ కేసులో సహకరించలేదనే 
మార్గదర్శి మేనేజర్‌ భార్య చోరీ కేసులో తాలూకా సీఐ భక్తవత్సలరెడ్డి సహకరించలేదన్న కసితో ఎల్లో గ్యాంగ్‌ రగిలిపోతోంది. సంఘటన జరిగిన రోజు కేసు కట్టకుండా ఎల్లో మీడియా ఒత్తిడి తెచ్చినా నిందితులకు సహకరించలేదని ప్రచారం జరిగింది. ఒంగోలు మార్గదర్శి బ్రాంచిలో మేనేజర్‌గా పనిచేసే కె.నాగేశ్వరరావు భార్య నగరంలో ఒక దొంగల ముఠాను తయారు చేసింది. అపార్ట్‌మెంట్లు, శివారు ప్రాంతాల్లో ఒంటరిగా నివశించే మహిళలను టార్గెట్‌ చేసి దొంగతనాలకు పాల్పడుతోంది. జిల్లాలోని దొనకొండ, పొదిలి, పెళ్లూరు, ఒంగోలు శివారులో ఆ ముఠా దొంగతనాలకు పాల్పడింది.

అయితే ఒంగోలులోని ఒక బ్యూటీషియన్‌ ఇంట్లో దొంగతనానికి పాల్పడిన కేసు జిల్లాలో సంచలనం సృష్టించింది. ఈ కేసును నమోదు చేయకుండా సహకరించాలని ఈనాడు ద్వారా దామచర్ల జనార్దన్‌తో పాటుగా టీడీపీ నాయకులు సీఐ భక్తవçత్సలరెడ్డి మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకొని వచ్చారు. కేసు నమోదు చేయకుండా రాజీ చేయాలని ప్రయతి్నంచారు. అయితే ఆయన వారికి లొంగలేదు. కేసు నమోదు చేయడమే కాకుండా చార్జిïÙటు దాఖలు చేశారు. తమకు సహకరించకుండా కేసు నమోదు చేశారన్న కసితో ఉన్న ఎల్లో మీడియా ఇప్పుడు ఆయన మీద 
నిరాధార ఆరోపణలు చేస్తోంది.  

Advertisement
 
Advertisement