
రైతులతో మాట్లాడుతున్న ఈడీ శ్రీధర్‌బాబు
గిద్దలూరు రూరల్ : పట్టణంలోని అర్బన్ కాలనీలో ఆదివారం ఉదయం సీదేవప్రభాకర్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ కార్యక్రమం నిర్వహించారు. అక్రమ మద్యం, గంజాయి, ఇతర నిషేధిత వస్తువుల నిల్వలు నిర్మూలించే కార్యక్రమంలో భాగంగా ఎస్పీ ఆదేశాల మేరకు కార్యక్రమం నిర్వహించినట్లు సిఐ తెలిపారు. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించి సరైన ధృవపత్రాలు లేని 16 ద్విచక్రవాహనాలు, రెండు ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కార్యక్రమలో కంభం సీఐ ఎం రాజేష్‌కుమార్, ఎస్సైలు మహేష్, సుబ్బరాజు, కృష్ణ, పావని, నరసింహారావు, నాగమల్లేశ్వరరావు, పులిరాజేష్, అజితారావు, 40 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
పొగాకు పంటను పరిశీలించిన బోర్డు ఈడీ
ఒంగోలు సెంట్రల్: మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న పొగాకు పంట పొలాలను పొగాకు బోర్డు గుంటూరు ఈడీ అద్దంకి శ్రీధర్‌బాబు ఆదివారం పరిశీలించారు. ఒంగోలు–2, టంగుటూరు పొగాకు వేలం కేంద్రం పరిధిలోని త్రోవగుంట, మద్దిరాలపాడు, చేకూరపాడు, తుమాడు, కె.ఉప్పలపాడు గ్రామాల్లో దెబ్బతిన్న పొగాకు పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ తుఫాన్‌కు దెబ్బతిన్న పొలాల వివరాలను రైతుల వారీగా సేకరించి నివేదిక పంపాలని బోర్డు ఆర్‌ఎం లక్ష్మణరావుకు సూచించారు. అన్ని నివేదికలు పరిశీలించి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తామని చెప్పారు. కార్యక్రమంలో గుంటూరు బోర్డు ఏఎస్ రామాంజనేయులు, ఒంగోలు ఏఎస్‌లు కె.రామకృష్ణ, శ్రీనివాసరావు, బోర్డు మెంబర్లు పి.వరప్రసాద్, బ్రహ్మయ్య, సిబ్బంది పాల్గొన్నారు.

కాలనీవాసులతో మాట్లాడుతున్న పోలీసు అధికారులు