
ప్రసంగిస్తున్న గంటా శ్రీరామ్, పక్కన తిరుపతయ్య
ఒంగోలు టౌన్: రాష్ట్రంలోని పశువులు ప్రతిరోజూ అనేక రకాల జబ్బులు, ప్రమాదాల వలన చనిపోతున్నాయని, పశుపోషకుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని గొర్రెల బీమా పథకాన్ని పునరుద్ధరించాలని ఏపీ గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు గంటా శ్రీరాం డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న నిధులను వెంటనే విడుదల చేసి పెంపకందార్లను ఆదుకోవాలని కోరారు. స్థానిక ఎల్బీజీ భవన్‌లో ఆదివారం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. కండే బాలకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో శ్రీరాం ప్రసంగిస్తూ.. గొర్రెల బీమా పథకాన్ని పునరుద్ధరించాలని, గొర్రెల ఖరీదును పది వేల రూపాయలకు పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జిల్లా కార్యదర్శి తోట తిరుపతిరావు ప్రసంగిస్తూ గొర్రెల పెంపకందార్లను ప్రోత్సహించాలని కోరారు. అందుకు తగిన నిధులు కేటాయించి గొర్రెల పెంపకాన్ని అభివృద్ధి చేయాలన్నారు. కార్యక్రమంలో బొడ్డు రామరాజు, గుమ్మా బాలనాగయ్య, బి.శివయ్య, తాళ్లూరి శ్రీనివాసరావు, రావెళ్ల వెంకటరావు, కోనంకి ఆంజనేయులు పాల్గొన్నారు.