
అనంతవరం గ్రామంలో 20 ఏళ్లుగా నివాసం ఉంటున్నాను. సచివాలయంలో దరఖాస్తు చేసుకున్నా సాంకేతిక లోపం వలన రేషన్ కార్డు లేక ప్రభుత్వ పథకాలు పొందలేక పోతున్నాం. ఇప్పుడు సీఎం జగనన్న దయ వలన జగనన్న సురక్ష కార్యక్రమంలో సమస్యలు సత్వరమే పరిష్కారం చేస్తారని విని నమ్మలేదు. కానీ రేషన్‌కార్డు దరఖాస్తు చేసుకోగా వలంటీరు వచ్చి అవసరమైన సర్టిఫికెట్లు తీసుకొని ఒక్క రూపాయి ఖర్చు లేకుండా రేషన్‌కార్డు అందించారు. ఇక పై నాకు కూడా రేషన్ సరుకులతో పాటు ప్రభుత్వ పథకాలు అందుతాయి. సీఎం జగనన్నకు ధన్యవాదాలు.
– ఉప్పలపాటి వెంకట సుబ్బయ్య, అనంతవరం, టంగుటూరు మండలం