
ద్వితీయ స్థానంలో నిలిచిన బాలుర జట్టు
ఒంగోలు: డాడ్జ్‌బాల్ రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తాచాటారు. బాలికల విభాగంలో ఏకంగా ప్రథమస్థానంలో నిలిచి బంగారు పతకం సాధించారు. బాలుర విభాగంలో ద్వితీయ స్థానంలో నిలిచి రజిత పతకాన్ని కై వసం చేసుకున్నారు. ఆదివారం బాపట్ల జిల్లా చిలుమూరులో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా బాలబాలికల జట్లు జయకేతనం ఎగురవేయడంపై అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రాహుల్, ప్రధాన కార్యదర్శి ఎం.సుబ్బారావు, ఉపాధ్యక్షుడు మండవ గోపి, కోశాధికారి దొండపాటి రామిరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో అభినందించారు. వీరు త్వరలో బెంగళూరులో జరిగే జాతీయ పోటీల్లో పాల్గొననున్నారు.

డాడ్జ్‌బాల్ రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రథమస్థానం సాధించిన జిల్లా బాలికల జట్టు