
ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ను సన్మానిస్తున్న భాస్కరరెడ్డి
కురిచేడు:
ప్రభుత్వ అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహనరెడ్డి ప్రభుత్వం పని చేస్తోందని దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మండలంలోని పడమర గంగవరం పంచాయతీ పరిఽధిలోని రెడ్డెన్నపల్లి, పడమర గంగవరం ఎస్సీ కాలనీల్లో గురువారం పర్యటించారు. ఎమ్మెల్యే వేణుగోపాల్‌ను సర్పంచ్ భాస్కరరెడ్డి సన్మానించారు. ముందుగా గ్రామంలోని రామాలయంలో ప్రత్యేక పూజలు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికి లబ్ధి చేకూరేలా పథకాలు అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రిదేనన్నారు. తుమ్మెదలపాడు నుంచి గంగదొనకొండ వరకు రోడ్డు మంజూరు చేసి వర్క్ ఆర్డర్ ఇచ్చినట్లు తెలిపారు. పలు విభాగాల నేతలు షేక్ సైదా, మేరువ సుబ్బారెడ్డి, కాకర్ల కాశయ్య, ధనిరెడ్డి వెంకటరెడ్డి, బెల్లం చంద్రశేఖర్, అన్నెం శ్రీనివాసరెడ్డి, కాసు రామకృష్ణారెడ్డి, ధనిరెడ్డి సుబ్బారెడ్డి, ధనిరెడ్డి వెంకటరెడ్డి, గంగుల ఆదినారాయణ రెడ్డి, వైవీ సుబ్బయ్య, ఆవుల వెంకటరెడ్డి, కురిచేడు సర్పంచ్ కేసనపల్లి కృష్ణయ్య, సాదం నాసరయ్య, కంభంపాటి రమేష్, మాదిరెడ్డి రామృష్ణారెడ్డి ,అన్నెం అమరనాథ రెడ్డి పాల్గొన్నారు.