
రమణారెడ్డి దంపతులకు కలశం, మెమొంటో అందజేస్తున్న సర్పంచ్, వైస్ ఎంపీపీ దంపతులు
సీఎస్‌పురం (పామూరు): వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా సీఎస్‌పురం మండలం అయ్యలూరివారిపల్లెలో బుధవారం గణపతి మండపం వద్ద నిర్వహించిన వేలంలో కలశం అక్షరాలా రూ.12 లక్షలు పలికింది. అదేవిధంగా లడ్డు రూ.6 లక్షలు పలికింది. వేలంలో గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకుడు ముత్యాల రమణారెడ్డి (పోలిరెడ్డి), దంపతులు వేలంలో రూ.12 లక్షలు వెచ్చించి కలశం దక్కించుకున్నారు. లడ్డును గ్రామానికి చెందిన గానుగపెంట మోహన్‌రెడ్డి దంపతులు రూ.6 లక్షలు వెచ్చించి దక్కించుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ ముత్యాల భారతీరెడ్డి, నాయకులు ముత్యాల నారాయణరెడ్డి, వైస్ ఎంపీపీ భూమిరెడ్డి ప్రభంజన, వెంకటరెడ్డిలు కలశం, లడ్డులను వేలం విజేతలకు అందజేసి ఘనంగా సన్మానించారు.
వేలంలో దక్కించుకున్న వైఎస్సార్ సీపీ నేత రమణారెడ్డి
రూ.6 లక్షలు పలికిన లడ్డు వేలం