
పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్న దాత నాగార్జున్‌రెడ్డి, ఎంపీపీ సావిత్రి
50 మంది ఎస్సీలకు
హనుమంతునిపాడు: నిరుపేద ఎస్సీ కుటుంబాలకు ఓ సర్పంచ్ కుమారుడు ఉచితంగా ఇంటి స్థలం అందజేసి ఔదార్యాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. నల్లగండ్ల సర్పంచ్ బత్తుల నారాయణమ్మ కుమారుడు వైఎస్సార్ సీపీ నాయకుడు బత్తుల నాగార్జున్‌రెడ్డి తమ గ్రామంలో ఇంటి స్థలం లేక ఇబ్బంది పడుతున్న 50 ఎస్సీ కుటుంబాలను గుర్తించారు. గ్రామంలోని ఎస్సీ కాలనీ పక్కనే ఉన్న 1.10 ఎకరాల భూమిని రూ.6 లక్షలకు కొనుగోలు చేశారు. ఒక్కొక్కరికి 2 సెంట్ల చొప్పున కేటాయించారు. బుధవారం గ్రామంలో ఎంపీపీ గాయం సావిత్రి చేతులమీదుగా పట్టాలు పంపిణీ చేశారు. సర్పంచ్ నారాయణమ్మ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీపీ మాట్లాడుతూ.. పేదలకు ఉచితంగా స్థలాలివ్వడంతోపాటు వారి పేరు మీద రిజస్ట్రేషన్ కూడా చేయడం అభినందనీయమన్నారు. స్థలదాత నాగార్జునరెడ్డికి కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ యక్కంటి శ్రీనివాసులరెడ్డి, మాజీ ఎంపీపీ గాయం బలరామిరెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు భవనం కృష్ణారెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు వేశపోగు గురుప్రసాద్, విద్యుత్ శాఖ ఏడీ గాయం వినయ్‌కుమార్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ల సంఘ అధ్యక్షుడు జి.ఆదినారాయణరెడ్డి, బత్తుల శ్రీనివాసులురెడ్డి, ఎంపీటీసీ టి.తిరుపతరెడ్డి, ఏరువ వెంకటరెడ్డి, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
నల్లగండ్ల సర్పంచ్ కుమారుడి ఔదార్యం
రూ.6 లక్షలు వెచ్చించి 1.10 ఎకరాలు కొనుగోలు