మార్కాపురం రూరల్: మార్కాపురం మండలం కొండేపల్లి గ్రామంలో పోలేరమ్మ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాల 16 రోజుల పండుగ సందర్భంగా ఈ నెల 23న రాష్ట్ర స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. విజేతలకు మొదటి బహుమతి లక్ష రూపాయలను ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి, రెండో బహుమతి రూ.80 వేలను ఏఎంసీ చైర్మన్ గొలమారి శ్రీనివాసరెడ్డి, మూడో బహుమతి రూ.60 వేలను లక్ష్మీచెన్నకేశవ యూత్ అసోషియేషన్ కొండేపల్లి, నాలుగో బహుమతి రూ.40 వేలను మందటి ఆవులరెడ్డి అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు 94408 37199, 81420 21443ను సంప్రదించాలని సూచించారు.