ఒంగోలు అర్బన్: డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఉత్తర్వుల మేరకు గుంటూరు జోన్‌పరిధిలో ఖాళీగా ఉన్న 34 స్టాఫ్ నర్సుల పోస్టులు ఒప్పంద విధానంలో భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 21 నుంచి వచ్చే నెల 5వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు పూర్తి చేసిన దరఖాస్తులను ప్రాంతీయ వైద్య ఆరోగ్య సంచాలకులు గుంటూరు జోన్–3 కార్యాలయంలో అందజేయాలని పేర్కొన్నారు. వివరాలకు https://cfw.ap.nic.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని గుంటూరు జోన్–3 ప్రాంతీయ ఆరోగ్య సంచాలకులు ఒక ప్రకటనలో తెలిపారు.