
బాబూరావు మృతదేహం
పొదిలి: కలెక్టర్ ఆధ్వర్యంలో మండల స్థాయి స్పందన కార్యక్రమం బుధవారం పొదిలిలో నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ అశోక్‌కుమార్‌రెడ్డి తెలిపారు. రథం రోడ్డులోని శ్రీసాయి బాలాజీ కళ్యాణ మండపంలో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలపై కలెక్టర్‌కు అర్జీలు ఇవ్వవచ్చని, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు.
కారు ఢీకొని రైతు మృతి
పామూరు: కారు ఢీకొని రైతు మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని వేములపల్లివద్ద 565వ జాతీయ రహదారిపై మంగళవారం జరిగింది. ఎస్సై సురేష్‌యాదవ్ తెలిపిన వివరాలు... బాపట్ల జిల్లా కొల్లూరు మండలం జువ్వలపాలెంకు చెందిన ఉదరవల్లి బాబూరావు, కిష్టమ్మ దంపతులు 3 ఏళ్ల నుంచి నుంచి వేములపల్లి వద్ద భూములను కౌలుకుతీసుకుని సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో వగ్గంపల్లె గ్రామానికి వచ్చి ఇంటికి వెళుతున్న సమయంలో పామూరు నుంచి కనిగిరి వెళుతున్న కారు వేగంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలాన్ని సందర్శించిన ఎస్సై సురేష్ కేసునమోదుచేసి దర్యాప్తుచేస్తున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కనిగిరి తరలించారు.
ఇంటి సమీపంలోనే దుర్మరణం...
కొద్ది నిముషాల్లో ఇంట్లోకి వెళ్లనుండగా కారు రూపంలో బాబూరావును మృత్యువులు కబళించింది. అప్పటివరకు తనతో ఉన్న భర్త అల్పాహారం తిని వచ్చేందుకు వెళ్లి ఇలా ఇంటి సమీపంలో మృత్యువాత పడటంతో భార్య కిష్టమ్మ కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
పీసీపల్లి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళఇతే..మండల పరిధిలోని రామాపురం గ్రామానికి చెందిన టి.సామ్యేలు(26) వృత్తిరీత్యా బేల్దారి పనిచేస్తుంటాడు. మూడేళ్ల క్రితం హనుమంతునిపాడు మాసాయిపేటకు చెందిన మనితో వివాహమైంది. వీరికి మూడు నెలల క్రితం కుమారుడు పుట్టాడు. వినాయకచవితి పర్వదినం సందర్భంగా గ్రామంలో ఉన్న కొడుకునుచూసేందుకు మాసాయిపేటకు బైక్‌పై వెళుతుండగా రామాపురం వద్ద ఐస్ బండి ఢీకొంది. ప్రమాదంలో రోడ్డుపై పడగా అదే సమయంలో అటు వెళుతున్న కారు సామ్యేల్‌పై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మాధవరావు తెలిపారు. కాగా పండగ పూట ఇంటికి భర్త వస్తాడనుకున్న ఎదురుచూస్తున్న భార్యకు మృతి వార్త తెలిసి కన్నీరుమున్నీరుగా విలపించింది.

సామ్యేలు మృతదేహం