మళ్లీ వైఎస్సార్‌సీపీదే విజయం  | Sakshi
Sakshi News home page

మళ్లీ వైఎస్సార్‌సీపీదే విజయం 

Published Mon, Sep 25 2023 5:03 AM

YSRCPs victory again - Sakshi

సాక్షి, అమరావతి: దేశ చరిత్రలో ఎన్నికలకు ముందు చెప్పిన మేనిఫెస్టోను అధికారంలోకి వచ్చిన తర్వాత కచ్చితంగా అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని ఏపీ ప్రభుత్వ సలహాదారు (ఎల్రక్టానిక్‌ మీడియా) అలీ అన్నారు. వైఎస్సార్‌సీపీ ఆ్రస్టేలియా విభాగం ఆధ్వర్యంలో ఆదివారం బ్రిస్బేన్‌లో “మీట్‌ అండ్‌ గ్రీట్‌’ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన అలీ మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో మళ్లీ వైఎస్సార్‌సీపీదే విజయమని ధీమా వ్యక్తంచేశారు.

మరోసారి ముఖ్యమంత్రిగా జగన్‌ను గెలిపించుకునేందుకు ఎన్‌ఆర్‌ఐలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తండ్రి వైఎస్సార్‌ చూపిన బాటలో సీఎం జగన్‌ నడుస్తూ ప్రజా సంక్షేమంలో నాలుగు అడుగులు ముందుకేస్తూ కొత్త ఒరవడిని సృష్టించారని ప్రశంసించారు. ప్రజలే తన బలమని విశ్వసించి వారితోనే పయనం సాగిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఆస్ట్రేలియా క న్వినర్‌ చింతలచెరువు సూర్యనారాయణరెడ్డి, ఇరువూరి బ్రహ్మరెడ్డి, జస్వంత్‌రెడ్డి బొమ్మిరెడ్డి , కోట శ్రీనివాస్‌రెడ్డి, రఘు రెడ్డి బిజివేముల, గజ్జల చంద్రారెడ్డి, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.  

Advertisement
 

తప్పక చదవండి

Advertisement