లోకేష్‌.. అదే జరిగితే టీడీపీ మనుగడకే ప్రమాదం: ఎంపీ విజయసాయిరెడ్డి | YSRCP MP Vijaya Sai Reddy Political Counter To TDP | Sakshi
Sakshi News home page

లోకేష్‌.. అదే జరిగితే టీడీపీ మనుగడకే ప్రమాదం: ఎంపీ విజయసాయిరెడ్డి

Jul 19 2024 6:07 PM | Updated on Jul 19 2024 6:31 PM

YSRCP MP Vijaya Sai Reddy Political Counter To TDP

సాక్షి, ఢిల్లీ: ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత జరుగుతున్న హత్యలు, అ‍త్యాచారాలు, దాడులపై నారా లోకేష్‌ శ్వేతపత్రం ఇవ్వాలన్నారు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. రాష్ట్రంలో ఇదే పరిస్థితి కొనసాతే ఒక కులానికి ప్రాతినిధ్యం వహించే పార్టీగా చరిత్రలో నిలిచిపోవచ్చు అని అన్నారు.

కాగా, ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్‌ వేదికగా..‘రాష్ట్రంలో గత నెల రోజుల్లో జరిగిన రావణకాష్టం గురించి జిల్లాల వారీ జరిగిన హత్యలు, అత్యాచారాలు, దాడులు, దోపిడీలు, దొమ్మీల మీద నారా లోకేష్ శ్వేతపత్రం ఇవ్వాలి. అశ్వత్థామ హతః కుంజరః అనే మీ విధానం విడనాడండి. ఇది ఇలాగే కొనసాగితే టీడీపీ మనుగడకే ప్రమాదం లేకుంటే ఒక కులానికి ప్రాతినిధ్యం వహించే పార్టీగా చరిత్ర పుటల్లో నిలిచిపోవచ్చు’ అంటూ కామెంట్స్‌ చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement