‘M అంటే మోసం.. D అంటే దగా.. S అంటే సూట్‌కేస్‌’ | YSRCP Leader Tatiparthi Chandrasekhar Slams AP Govt | Sakshi
Sakshi News home page

‘M అంటే మోసం.. D అంటే దగా.. S అంటే సూట్‌కేస్‌’

May 26 2026 4:35 PM | Updated on May 26 2026 4:49 PM

YSRCP Leader Tatiparthi Chandrasekhar Slams AP Govt

తాడేపల్లి:  మెగా డీఎస్సీ పేరుతో కూటమి ప్రభుత్వం పూర్తిగా దగా చేసిందని వైఎస్సార్‌సీపీ నేత, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌ ధ్వజమెత్తారు. Mega Dsc లో ‘M అంటే మోసం.. D అంటే దగా.. S అంటే సూట్‌కేస్‌’ అని విమర్శించారు. పేపర్‌ లీక్‌, డేటా డిలీట్‌, సూట్‌కేస్‌ రాజకీయాలతో పచ్చ నేతలు పండగ చేసుకుంటున్నారని మండిపడ్డారు. 

‘రాష్ట్రం దోపిడీకి గురవుతున్నా చంద్రబాబు చూస్తూ ఊరుకుంటున్నారు. ‘‘సూట్‌కేస్‌ మంత్రి” ద్వారా వ్యవహారాలు నడిపిస్తున్నారు.  నారా లోకేష్‌ను “సకల శాఖ మంత్రి”గా మార్చారు. ఐటీ శాఖను “ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ” నుంచి “ఇల్లీగల్ టెక్నాలజీ”గా మార్చారు. క్రీడా మైదానంలో అడుగుపెట్టని వారికి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఎలా వచ్చాయి? ,  స్పోర్ట్స్ కోటా ఎంపికల వివరాలను ప్రభుత్వం ఎందుకు బయటపెట్టడం లేదు?, 1999, 2014లో నిరుద్యోగ భృతి పేరుతో చంద్రబాబు మోసం చేశారు. ఇప్పుడు కూడా మళ్ళీ అదే చేస్తున్నారు. 

నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని ఇప్పటివరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదు. డీఎస్సీలో భారీ అక్రమాలు జరిగినా ప్రభుత్వం ఎందుకు విచారణ చేయటం లేదు.  వారే పరీక్షలు నిర్వహిస్తారు.. వారే పేపర్‌ లీక్‌ చేస్తారు.. వారే డేటా డిలీట్‌ చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి రహస్యంగా మెసేజ్‌లు పంపించారు. మెరిట్ లిస్ట్ ఎందుకు ప్రకటించడం లేదు?, డీఎస్సీని “పచ్చ తమ్ముళ్ల కలెక్షన్ కౌంటర్”గా మార్చారు.  చంద్రబాబు, లోకేష్‌, అధికారులు ఎవ్వరూ నిజాలు చెప్పడం లేదు. మరోసారి నిరుద్యోగులను మోసం చేశారు.

లోకేష్‌కు,  వైఎస్ జగన్‌కు పోలికే లేదు.  వైఎస్ జగన్ విద్యాశాఖను గొప్ప వ్యవస్థగా మార్చారు. ప్రభుత్వ పాఠశాలలను దేవాలయాల్లా తీర్చిదిద్దిందీ జగనే. లోకేష్ వచ్చాక డిజిటల్ క్లాస్‌రూమ్స్, టోఫెల్‌, ఇంగ్లీష్ మీడియం, ట్యాబ్‌లను తొలగించారు.  ప్రభుత్వ స్కూళ్లలో నాసిరకం భోజనం, మురుగునీరు, డ్యామేజ్‌ షూలు, నాసిరకం బ్యాగులు ఇస్తున్నారు. నెల వచ్చిందంటే పేదల ఖాతాల్లో నేరుగా డబ్బులు వేసిన సీఎం వైఎస్ జగన్ మాత్రమే.  డీఎస్సీ అవినీతిపై పూర్తి స్థాయి విచారణ జరిపి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలి.  నిరుద్యోగులను మోసం చేసిన కూటమి ప్రభుత్వం ప్రజలకు క్షమాపణ చెప్పాలి. కూటమి ప్రభుత్వ విధానాలు రాష్ట్ర భవిష్యత్తును దిగజారుస్తున్నాయి’ అని మండిపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement