‘మంత్రులు సింగపూర్ వెళ్లి ఏం ఒరగబెట్టారు?’ | YSRCP Leader Karumuri Venkatareddy Slams Chandrababu Govt | Sakshi
Sakshi News home page

‘మంత్రులు సింగపూర్ వెళ్లి ఏం ఒరగబెట్టారు?’

May 1 2026 4:06 PM | Updated on May 1 2026 4:12 PM

YSRCP Leader Karumuri Venkatareddy Slams Chandrababu Govt

తాడేపల్లి : కూటమి ప్రభుత్వం బాధ్యత మరిచి బరితెగింపునకు దిగిందని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి విమర్శించారు.  కూటమి ప్రభుత్వం చర్యలను ఎవరు ప్రశ్నించినా కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. అమరావతి భవనాల సోకుల గురించి, మంత్రులు సింగపూర్‌ పర్యటన గురించి మాట్లాడితే కేసులు పెడతామని బెదిరిస్తారా? అని నిలదీశారు.

ఈరోజు(శుక్రవారం, మే 1వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయం నుంచి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ‘ వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరిని ఆటోలో తీసుకెళ్లడం కక్షపూరిత వైఖరికి నిదర్శనం. మంత్రులు సింగపూర్ వెళ్లి ఏం ఒరగబెట్టారు?, దీనికి సమాధానం చెప్పకుండా మంత్రులు ఎదురుదాడి చేస్తున్నారు. వ్యవసాయమే లేని సింగపూర్ లో వ్యవసాయం పై ట్రైనింగా?, పరిశ్రమల మంత్రి లేకుండా పారిశ్రామికీకరణ పై శిక్షణా?, చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానాల్లో జల్సాలు చేస్తున్నారు. 

పేదలకు ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వటానికి చేతులు రావు. కానీ వందల కోట్లు దుబారా చేస్తున్నారు. అమరావతిలో బిల్డింగులకు రూ.2540 కోట్లు ఖర్చు చేస్తారా?, దీనిపై ప్రశ్నిస్తే కేసులు పెట్టి వదిస్తారా?, పెద్దపెద్ద రాష్ట్రాల్లో కూడా చేయనంత అప్పులు చంద్రబాబు చేస్తున్నారు. డీజిల్, పెట్రోలు కొరతకు వైఎస్సార్‌సీపీనే కారణమంటారా?, క్యాబినెట్ మంత్రులకు కొద్దిగైనా సిగ్గు ఉండాలి. ఇంధన కృత్రిమ కొరత వెనుక రూ.150 కోట్ల స్కాం  ఉంది. కూటమి ప్రభుత్వం పతనానికి సమయం ఆసన్నమైంది. అక్రమ కేసులకు భయపడేది లేదు’ అని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement