
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రజలను నమ్మించి మోసం చేసిందన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. చంద్రబాబు సర్కార్‌కు హామీలు అమలు చేసే సత్తా లేదన్నారు. బడ్జెట్ ప్రసంగంలో వైఎస్ జగన్‌ను విమర్శించడం.. నారా లోకేష్‌ను పొగడటమే పనిగా పెట్టుకున్నారని చెప్పుకొచ్చారు.
మాజీ మంత్రి అమర్నాథ్ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వైఎస్ జగన్ నెరవేర్చారు. కోవిడ్ సమయంలో కూడా వైఎస్ జగన్ సంక్షేమ పథకాలను అందించారు. బడ్జెట్ ప్రసంగంలో కూటమి ప్రభుత్వం వైఎస్ జగన్ జపం చేసింది. చంద్రబాబు ప్రభుత్వ బడ్జెట్ రాష్ట్ర ప్రజలను నిరాశ పరిచింది. కూటమి నేతలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించారు.
హలో ఏపీ.. కూటమి పెట్టింది టోపీ.. అనే విధంగా ప్రజలు భావిస్తున్నారు. రాష్ట్ర బడ్జెట్‌పై ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూశారు. కేటాయింపుల ద్వారా తమ జీవితాలు మారుతాయని ఆశ పడ్డారు. బడ్జెట్ ద్వారా ప్రజలకు నిరాశే మిగిలింది. వైఎస్ జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తారని ప్రజలు భావించారు. చంద్రబాబు అంటే మోసమని మరోసారి రుజువైంది.
కూటమి ప్రభుత్వం ప్రజలను నమ్మించి మోసం చేసింది. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవకు నిధుల్లో కోత పెట్టారు. తల్లికివందనం పథకానికి రూ.13,113 కోట్లు అవసరమైతే రూ.9,407 కోట్లు మాత్రమే కేటాయించారు. ఆడపిల్లకు వందనం, ఉచిత బస్సు, నిరుద్యోగ భృతికి అసలు నిధులే కేటాయించలేదు. వైఎస్ జగన్ విలువ ఇప్పుడు అందరికీ తెలుస్తుంది. బడ్జెట్‌లో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కేటాయించలేదు. నిరుద్యోగులకు ఏడాదికి 7000 కోట్లు ఇవ్వాలి. 18 ఏళ్లు దాటిన మహిళకు 27000 కోట్లు ఇవ్వాలి.

హామీలు దసరా, దీపావళికి అమలు చేస్తామన్నారు.. వాయిదా వేశారు. సంక్రాంతికి వస్తామన్నారు, సినిమా వచ్చింది కానీ చంద్రబాబు రాలేదు. తొలి సంతకం డీఎస్సీకి దిక్కుమొక్కు లేదు. షుగర్ ఫ్యాక్టరీ రైతులు రోడ్డుక్కె పరిస్థితి ఏర్పడింది. కూటమి పాలనపై ప్రజలు తిరగబడే పరిస్థితి వచ్చింది. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమకు నిధులు ఎందుకు కేటాయించలేదు?. సంపద సృష్టి అనేది అమరావతి కోసమేనా?. మెట్రో రైలు, ఉత్తరాంధ్ర సృజల స్రవంతి పరిస్థితి ఏమిటి? అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం హామీలు అమలు చేసే వరకు వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తుంది’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment