YSRCP: రాజ్యసభ పోటీలో ముగ్గురు అభ్యర్థులు వీరే.. | Sakshi
Sakshi News home page

YSRCP: రాజ్యసభ పోటీలో ముగ్గురు అభ్యర్థులు వీరే..

Published Thu, Feb 8 2024 12:48 PM

YSRCP Anounced Three Rajya Sabha Members - Sakshi

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ ముగ్గురు రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించింది. రాజ్యసభ బరిలో వైవీ సుబ్బారెడ్డి, గొల్లా బాబురావు, మేడా రఘునాథ రెడ్డి పేర్లను ఖరారు చేశారు.  

కాగా, రాజ్యసభ బరిలో నిలిచే ముగ్గురు అభ్యర్థుల పేర్లను వైఎస్సార్‌సీపీ తాజాగా ప్రకటించింది. వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, మేడా రఘునాథ రెడ్డి ఎన్నికల్లో పోటీలో ఉండనున్నారు. ఇక, నేటి నుంచి ఈనెల 15వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరించనున్నారు. ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలకు 27న పోలింగ్‌ జరుగనుంది.

అనంతరం, అసెంబ్లీలో ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిసి గొల్ల బాబూరావు, మేడా రఘునాథరెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలు  కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ముగ్గురు రాజ్యసభ అభ్యర్ధులను ముఖ్యమంత్రి అభినందించారు.

మేడా రఘనాథరెడ్డి నందలూరు మండలం చెన్నయ్యగారి పల్లెకు చెందినవారు. మాజీ టీటీడీ బోర్డు మెంబర్‌ మేడా రామకృష్ణారెడ్డికి ముగ్గురు కుమారులలో రెండవ కుమారుడు మేడా రఘునాధరెడ్డి. మొదటి కుమారుడు సిట్టింగ్ రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి. మేడా రఘనాథరెడ్డి అదే మండలంలోని టంగుటూరులో విద్యాభ్యాసం పూర్తిచేశారు. డిగ్రి పూర్తైన వెంటనే 20 ఏళ్ల వయస్సులోనే బెంగుళూరు కేంద్రంగా నిర్మాణ రంగంలోకి ప్రవేశించారు. 2006లో MRKR కన్స్ట్రక్షన్స్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ప్రస్తుతం వ్యాపార రంగంలొనే కొనసాగుతున్నారు.

ఇదీ చదవండి: కాంగ్రెస్ పాలనలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం : ఎంపీ విజయసాయిరెడ్డి

Advertisement
 
Advertisement