
జనం ఇబ్బందుల్లో ఉంటే.. వాళ్ల దగ్గరికి వెళ్లాలి. వాళ్ల సమస్యలు అడిగి తెలుసుకోవాలి. తమ బాధ్యతగా ప్రభుత్వాల్ని నిలదీయాలి. అవసరమైతే ‘నేనున్నాను..’ అంటూ బాధితుల్ని ఓదార్చాలి. అంతేగానీ తాను వెళ్తే ఇబ్బందులు తలెత్తుతాయని తప్పించుకునేవాడు అసలు నాయకుడేనా?.
అధికారంతో ఆయనకు సంబంధం లేదు. అది ఉన్నప్పుడు ఒకలా.. లేనప్పుడు మరోలా నటించడం ఆయనకు చేత కాదు. గత ఐదేళ్లు. పేదల ముఖాల్లో సంతోషం అనే వెలుగులు పూయించేందుకు ప్రతీ క్షణం పాటుపడ్డారు. సంక్షేమంతో అన్ని వర్గాలను ఆదుకునే ప్రయత్నం చేశారు. అప్పుడు.. ఇప్పుడు.. సమస్య ఎక్కడున్నా సత్వర పరిష్కారం కోసమే ఆయన తాపత్రయం కనిపిస్తుంది. అందుకేనేమో..
జగనన్న ఎక్కడికెళ్లినా ప్రజాభిమానం కట్టలు తెంచుకుంటుంది. పండు ముసలి నుంచి ఊహతెలిసిన పిల్లాడి దాకా.. ఆయన ఫాలోయింగ్ మాములుగా ఉండదు. ఆయన్ని దగ్గరగా చూడాలని, వీలైతే ఆయన్ని కలవాలని.. తమ ఫోన్లలో క్లిక్‌మనిపించాలని ఆరాటపడుతుంటారు. ఆ అభిమానాన్ని అంతే ఒద్దికగా ఆయన స్వీకరిస్తుంటారు. ఓల్డ్ ఆర్‌ఆర్ పేట వరద బాధితుల్ని కలవడానికి వెళ్లినప్పుడు తనను చూసి భావోద్వేగానికి గురైన ఓ చిన్నారి కన్నీళ్లను తుడుస్తూ కనిపించారాయన.
రాజకీయాల్లో అవసరాలకు తగట్లు మసులు కోవడం జగన్ స్టైల్ కానే కాదు. జనాలకు దూరంగా ఉండడం.. ఫొటోలకు ఫోజులిస్తూ సహాయక చర్యల్లో పాల్గొంటున్నామని బిల్డప్‌లు ఇవ్వడం.. ఆయన చేయరు. కులాల ప్రస్తావన తెచ్చి మరీ జనాలను కించపరిచేలా ఆయన ఏనాడూ మాట్లాడరు. ఎప్పటికీ ఆయన జనం మనిషి.. పేదల పక్షపాతి. అందుకే..
ఆయన వస్తున్నారంటేనే జనం ఆటోమేటిక్‌గా తరలివస్తారు. అది ఎలాంటి సందర్భం అయినా సరే!. తమ బాగుకోసం అంతలా ఆయన ఆలోచిస్తారని జనం గుర్తించారు కాబట్టే ఆ అభిమానం. అందుకే ఆ అభిమానాన్ని నిరుత్సాహపర్చడం ఇష్టంలేని ఆయన కూడా వాళ్లను దగ్గరకు తీసుకుంటారు.
తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భారీ ఫాలోయింగ్ ఉన్న మాస్ లీడర్. రాజన్న బిడ్డగా.. అంతకు మించి జనం మెచ్చిన జననేతగా జగన్‌కంటూ ఓ గుర్తింపు ఉంది. ఇది ఎవరైనా అంగీకరించాల్సిన విషయం.
ఇట్లు..
ఓ జగన్ అభిమాని