పీసీసీ అధ్యక్షుడు అందర్నీ కలుపుకొని పోవాలి: వీహెచ్‌ | Sakshi
Sakshi News home page

పీసీసీ అధ్యక్షుడు అందర్నీ కలుపుకొని పోవాలి: వీహెచ్‌

Published Mon, Dec 19 2022 11:50 AM

V Hanumantha Rao Comments On Revanth Reddy On Seniors issue - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు అందరినీ కలుపుకొని పోవా­లని మాజీ ఎంపీ వి.హనుమంతరావు (వీహెచ్‌) హితవు పలికారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమి తర్వాత అధిష్టానం సమీక్ష చేసి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. సమీక్ష చేసి ఓటమి కారణాలు తెలుసుకుని పార్టీని బలోపేతం చేసుకొనే దిశగా ముందుకెళ్లాలని సూచించారు.

ప్రస్తుత రిజర్వేషన్ల కారణంగా ఎక్కువ జనాభా ఉన్న ఓబీసీలకు అన్యాయం జరుగుతోందని వీహెచ్‌ ఆవేదన వ్యక్తంచేశారు. జనగణనతోపాటు కులగణన చేయాలని, ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈనెల 20న ఢిల్లీలో నిర్వహించే అన్ని పార్టీల ఓబీసీ ఎంపీలతో కార్యక్రమం నిర్వహించనున్నట్లు వీహెచ్‌ వెల్లడించారు. 
చదవండి: కాంగ్రెస్‌లో మరింత ముదిరిన సంక్షోభం.. పీసీసీ పదవులకు 12 మంది రాజీనామా

Advertisement
 
Advertisement
 
Advertisement