టీడీపీ నేతల రౌడీయిజం.. పిన్నెల్లి భార్యకు గాయాలు | Tdp Leaders Rowdyism In Palnadu District | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతల రౌడీయిజం.. పిన్నెల్లి భార్యకు గాయాలు

May 8 2024 4:39 PM | Updated on May 8 2024 5:20 PM

Tdp Leaders Rowdyism In Palnadu District

వెల్దుర్తి మండలం సిరిగిరిపాడులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు.

సాక్షి, పల్నాడు: పల్నాడు జిల్లాలో టీడీపీ నేతలు రౌడీయిజం ప్రదర్శించారు. వెల్దుర్తి మండలం సిరిగిరిపాడులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. వృద్ధుల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లపై టీడీపీ ఏజెంట్లు దాడికి దిగారు. 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లపై రాళ్లతో దాడి చేశారు. అదే గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భార్య రమాదేవిపై కూడా దాడి చేసి.. వాహనాలను ధ్వంసం చేశారు. అడ్డకున్న వెల్దుర్తి ఎస్‌ఐ శ్రీహరిపై కూడా టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు.

టీడీపీ నేతల రౌడీయిజం.. పిన్నెల్లి భార్యకు గాయాలు

 

Advertisement
 
Advertisement
Advertisement