వైఎస్సార్‌సీపీలో చేరిన టీడీపీ నేతలు | TDP leaders joined YSRCP | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలో చేరిన టీడీపీ నేతలు

Aug 30 2023 4:31 AM | Updated on Aug 30 2023 4:31 AM

TDP leaders joined YSRCP - Sakshi

సాక్షి, అమరావతి: విజయనగరం జిల్లా రాజాంకు చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే తలే భద్రయ్య, ఆయన తనయుడు డాక్టర్‌ తలే రాజేశ్‌ వైఎస్సార్‌­సీపీలో చేరారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంగళవారం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని వారు కలిశారు. ఈ సందర్భంగా సీఎంకు పుష్పగుచ్ఛం అందజేశారు.

అనంతరం సీఎం వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వా­నించారు. గతంలో పాలకొండ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున రెండుసార్లు (1985, 1994) తలే భద్రయ్య గెలుపొందారు. అలాగే ఏపీపీఎస్సీ సభ్యు­డిగా ఆరేళ్లపాటు పనిచేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బా­రెడ్డి, విజయనగరం జిల్లా పరిషత్‌ చైర్మన్‌ చిన్న శ్రీను, రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు పాల్గొన్నారు.  

అనకాపల్లికి చెందిన పలువురు టీడీపీ నేతలు వైఎస్సార్‌సీపీలోకి..
అనకాపల్లి టీడీపీ నేత మలసాల భరత్‌ కుమార్, ఆ యన తల్లిదండ్రులు రమణారావు (విశాఖ డెయిరీ డైరెక్టర్‌), ధనమ్మ (మాజీ ఎంపీపీ) వైఎస్సార్‌సీపీలో చేరారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకోగా.. వా రికి సీఎం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వా­నించారు. భరత్‌ కుమార్‌ కుటుంబంతోపాటు గంగుపాం నాగేశ్వరరావు (మాజీ డీసీఎంఎస్‌ చైర్మన్‌), మల సాల కుమార్‌ రాజా (విశాఖ జిల్లా తెలుగు యువత ప్రధాన కార్యదర్శి) కూడా పార్టీలో చేరారు. 

Advertisement
 
Advertisement
Advertisement