టీడీపీలో టికెట్‌ మంటలు.. భగ్గుమన్న అసంతృప్తి | TDP Leaders Angry On Chandrababu | Sakshi
Sakshi News home page

టీడీపీలో టికెట్‌ మంటలు.. భగ్గుమన్న అసంతృప్తి

Mar 29 2024 4:14 PM | Updated on Mar 29 2024 5:41 PM

Tdp Leaders Angry On Chandrababu - Sakshi

 టీడీపీ టికెట్ల కేటాయింపుపై అసంతృప్తి జ్వాలలు భగ్గుమన్నాయి

సాక్షి, అనంతపురం: టీడీపీ టికెట్ల కేటాయింపుపై అసంతృప్తి జ్వాలలు భగ్గుమన్నాయి. అనంతపురం అర్బన్ టికెట్‌ను దగ్గుబాటి ప్రసాద్‌కు కేటాయించగా.. టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరికి చంద్రబాబు మొండిచేయి చూపారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రభాకర్‌ చౌదరి వర్గీయులు నిరసనకు దిగారు.

ప్రభాకర్ చౌదరి వర్గీయులు.. చంద్రబాబు ఫ్లెక్సీలు చించేసి దహనం చేశారు. చంద్రబాబు, లోకేష్‌లకు వ్యతిరేకంగా టీడీపీ నేతలు నినాదాలు చేశారు. చంద్రబాబు కోట్ల రూపాయలు డబ్బు తీసుకుని టికెట్లు కేటాయించారని టీడీపీ నేతలు ఆరోపించారు.

ఏజెన్సీ నేతలకు చంద్రబాబు హ్యాండ్
ఏజెన్సీ నేతలకు చంద్రబాబు హ్యాండ్ ఇచ్చారు. రా కదలిరా బహిరంగ సభలో దన్ను దొర పేరు ప్రకటించిన చంద్రబాబు.. చివరి నిమిషంలో సీటు బీజేపీకి కేటాయించారు. టీడీపీ ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా పనిచేస్తున్న దన్ను దొర.. రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. నక్సల్స్ కాల్పుల్లో మృతిచెందిన కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోము కుటుంబ సభ్యులకు చంద్రబాబు వెన్నపోటు పొడిచారు. సివేరు సోము కుమారుడు అబ్రహం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలకు కిడారి శ్రవణ్‌ దూరంగా  ఉంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement