
నెల్లూరు మాజీ జెడ్పీ ఛైర్మన్, టీడీపీ నేత బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో శుక్రవారం వైఎస్సార్‌సీపీలోకి చేరారు.
సాక్షి, అమరావతి: నెల్లూరు మాజీ జెడ్పీ ఛైర్మన్, టీడీపీ నేత బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలోకి చేరారు. శుక్రవారం.. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆయనకు వైఎస్సార్‌సీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
బొమ్మిరెడ్డితో పాటు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్, టీడీపీ నేత ఇందూరు వెంకటరమణా రెడ్డి వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు. ఎమ్మెల్యేలు మేకపాటి విక్రమ్ రెడ్డి, వరప్రసాద్, వైఎస్సార్‌సీపీ వెంకటగిరి సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి హాజరయ్యారు.
చదవండి: అమరావతి పేదల ఇళ్ల పట్టాల పంపిణీకి హైకోర్టు గ్రీన్‌సిగ్నల్