అమిత్‌ షాపై కామెంట్స్‌.. పరువు నష్టం కేసులో రాహుల్‌కు ఊరట

Sultanpur court grants bail to Rahul Gandhi in 2018 defamation case - Sakshi

ఉత్తరప్రదేశ్‌ న్యాయస్థానంలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి ఊరట లభించింది. 2018 పరువు నష్టం కేసులో రాహుల్‌కు సుల్తాన్‌పూర్‌ ప్రత్యేక కోర్టు మంగళవారం షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది.

కర్ణాటక ఎన్నికల సమయంలో 2018 మే 8న బెంగళూరులో జరిగిన విలేకరుల సమావేశంలో రాహుల్ గాంధీ.. హోం మంత్రి అమిత్ షాపై  అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ నాయకుడు విజయ్‌​ మిశ్రా అనే వ్యక్తి అదే ఏడాది ఆగస్టు 4న పరువు నష్టం కేసు వేశాడు. ఓ పక్క బీజేపీ నిజాయితీ, స్వచ్ఛమైన రాజకీయాలకు  కట్టుబడి ఉందని ప్రకటిస్తూనే మరో పక్క ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి ఆ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారంటూ రాహుల్‌ వ్యాఖ్యానించారు. రాహుల్‌ వ్యాఖ్యలు చేసిన సమయంలో అమిత్‌ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడి పదవిలో కొనసాగుతున్నారు.

రాహుల్‌ వ్యాఖ్యలను  తప్పుబడుతూ మిశ్రా కోర్టును ఆశ్రయించాడు. ఈ కేసుపై సుల్తాన్‌ పూర్‌ కోర్టు మంగళవారం విచారణ జరిపింది. కేసు విచారణకు నేడు రాహుల్‌ కూడా హాజరయ్యారు. ఈ మేరకు ఇరుపక్ష వాదనలు విన్న న్యాయస్థానం.. రాహుల్‌కు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది.
చదవండి: క్యా సీన్‌ హై.. వధువుకి పాదాభివందనం చేసిన వరుడు

ఈ సందర్భంగా రాహుల్‌ న్యాయవాది సంతోష్ పాండే విలేకరులతో మాట్లాడుతూ.. పరువు నష్టం కేసులో రాహుల్‌ నేడు కోర్టుకు హాజరైనట్లు తెలిపారు. కోర్టు నాయన్ను 30-45 నిమిషాల పాటు విచారించిందన్నారు. తర్వాత రాహుల్‌ బెయిల్ దరఖాస్తు సమర్పించబడంతో కోర్టు ఆమోదించిందని తెలిపారు. తదుపవరి విచారణ తేదీని ఇంకా ప్రకటించలేదని, ఈ కేసులో రాహుల్‌  నిర్దోషి అని, పరువు నష్టం కలిగించే విధంగా ఆయన ఎలాంటి ప్రకటన చేయలేదని పేర్కొన్నారు.

కాగా రాహుల్‌ చేపట్టిన భారత్‌జోడో న్యాయ యాత్ర ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోనే కొనసాగుతుండటం గమనార్హం. నేటి ఉదయం కోర్టుకు హాజరు కావడంతో యాత్ర తాత్కాలికంగా ఆపేశారు. మధ్యాహ్నం  మధ్యాహ్నం 2 గంటలకు అమేథీలోని ఫుర్సత్‌గంజ్ నుంచి తిరిగి ప్రారంభం కానుంది.

whatsapp channel

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top