
ఢిల్లీ: ఉప రాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ధన్‌ఖడ్ ఆకస్మిక రాజీనామాతో నేపథ్యంలో ఉప రాష్ట్రపతి పదవి ఎవరికి ఇస్తారనే చర్చ నడుస్తోంది. తెరపైకి పలువురు కీలక నేతల పేర్లు వచ్చినప్పటికీ.. కేంద్రంలోని బీజేపీ మాత్రం ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే.. ఖాళీ అయిన ఉప రాష్ట్రపతి పదవికి బీజేపీకి చెందిన నేతనే ఎన్నుకోనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
అయితే, ఉప రాష్ట్రపతి పదవికి పలువురు పరిశీలనలో ఉన్నాయని వార్తలు చక్కర్లు కొడుతున్న సమయంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో జేడీయూ నేత, కేంద్ర మంత్రి రామ్‌నాథ్ ఠాకూర్ భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో ఆయనకే ఈ పదవి ఇస్తారనే రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో బీజేపీ వర్గం స్పందిస్తూ.. కేంద్రమంత్రి రామ్‌నాథ్ ఠాకూర్‌ను ఎంపిక చేసే అవకాశం లేదని స్పష్టం చేశాయి. అలాగే, తదుపరి ఉప రాష్ట్రపతిగా బీజేపీకి చెందిన నేతనే ఎన్నుకోనున్నట్లు వెల్లడించాయి. పార్టీ సిద్ధాంతాలు, భావజాలానికి అనుగుణంగా వ్యవహరించే నేతకు ఉప రాష్ట్రపతి పదవిని అప్పగిస్తుందని సదరు వర్గాలు తెలిపాయి. నడ్డాతో రామ్‌నాథ్ భేటీ కేవలం సాధారణ సమావేశమేనని క్లారిటీ ఇచ్చింది.
ఇదిలా ఉండగా.. ఉప రాష్ట్రపతి పదవి రేసులో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, జేడీయూ నేత హరివంశ్ నారాయణ్ సింగ్ సహా పలువురి పేర్లు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా నితీశ్‌కు ఈ పదవి అప్పగిస్తారనే చర్చ ఊపందుకుంది. ఇక, తాజాగా బీజేపీ వర్గాల వ్యాఖ్యలతో ఒక్కసారిగా ట్విస్ట్ నెలకొంది. మరోవైపు.. ఉప రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ కోసం ఇప్పటికే ఈసీ కసరత్తు ప్రారంభించింది. త్వరలో దీనిపై షెడ్యూల్ విడుదల చేసే అవకాశాలున్నాయి.
🚨 BREAKING NEWS
The next Vice President will be from the BJP not from any allied party !
Good move @BJP4India 🔥🔥🔥#vicepresidentofindia #BJP4IND pic.twitter.com/vQsCPsbmxJ— Sachin ( Modi Ka Parivar ) (@SM_8009) July 24, 2025