
ఎంవీపీకాలనీ (విశాఖ)/మహారాణిపేట(విశాఖ దక్షిణ): బీజేపీలో చేరేందుకు పెద్దఎత్తున టీడీపీ నాయకులు సిద్ధంగా ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు కేతినేని సురేంద్రమోహన్ పదవీ ప్రమాణ స్వీకారోత్సవం ఆదివారం విశాఖలో నిర్వహించారు. వీర్రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో ద్వితీయ ప్రత్యామ్నాయ పార్టీగా బీజేపీ ఎదుగుతోందన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో చంద్రబాబుది ప్రతిపక్ష పార్టీ కాదని, కాంగ్రెస్ పక్షమని ఎద్దేవా చేశారు. ఎంపీ జీవీఎల్ మాట్లాడుతూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారం చేపట్టేలా కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ ధియోధర్ మాట్లాడుతూ చంద్రబాబు పాలన అవినీతి, బంధుప్రీతితో నిండిపోవడం వల్లే ప్రజలు వైఎస్సార్‌సీపీకి పట్టం కట్టారన్నారు.