శరద్ పవార్ రాజీనామా చేశారంటే.. దేశ రాజకీయాల్లో ఏదో జరగబోతోంది..!

Sharad Pawar Resign Shocked Me Says Sanjay Raut - Sakshi

ముంబై: ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్ ఆ పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం తనను షాక్‌కు గురి చేసిందని తెలిపారు ఉద్ధవ్ థాక్రే వర్గం శివసేన నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్. ఆయన అంత పెద్ద నిర్ణయం తీసుకన్నారంటే కచ్చితంగా ఏదో బలమైన కారణం ఉండి ఉంటుందని అభిప్రాయపడ్డారు. మహారాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లోనూ ఏదో అలజడి జరగబోతోందని అన్నారు.

రానున్న రోజుల్లో ఏం జరుగుతుంతో చూసి తాము ఓ నిర్ణయం తీసుకుంటామని  రౌత్ చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంపై ఓ కన్నేసి ఉంచిననట్లు తెలిపారు. గతంలో బాలాసాహెబ్ థాక్రే కూడా దిగజారుడు రాయకీయాలు చూసి పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న విషయాన్ని గుర్తు చేశారు. అయితే శివసైనికుల వి​జ్ఞప్తులతో బాలాసాహెబ్ అప్పుడు తన నిర్ణయాన్ని ఉపసంహరిచుకున్నారని, ఇప్పుడు పవార్ కూడా రాజీనామాను వెనక్కి తీసుకుంటారని ఆశిస్తున్నట్లు చెప్పారు. పవార్‌ను బాలాసాహెబ్‌తో పోల్చారు.
చదవండి: శరద్‌ పవార్‌ రాజీనామా తదనంతరం మరో ఎన్సీపీ నేత రాజీనామా

కాగా.. తాను అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్ల పవార్ మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఎన్సీపీ కార్యకర్తలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాజీనామా చేయవద్దని ప్రాధేయపడుతున్నారు. ఓ కార్యకర్త అయితే రాజీనామా ఉపసంహంరించుకోవాలని పవార్‌కు రక్తంతో లేఖ రాశాడు.

మరోవైపు పవార్ రాజీనామా అనంతరం ఎన్సీపీ కార్యదర్శి జితేంద్ర అవ్హాద్ కూడా తన పదవికి రాజీనామా చేశారు. థానే ఎన్సీపీ ఆఫీస్ బేరర్లు అందరూ కూడా రాజీనామ ా చేసినట్లు తెలిపారు. పవార్ తప్పుకోవడం వల్లే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
చదవండి: ఎన్సీపీ చీఫ్‌ పదవికి శరద్ పవార్ రాజీనామా.. అజిత్ పవార్ సంచలన వ్యాఖ్యలు..

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top