టీడీపీ మాజీ ఎమ్మెల్యేపై అట్రాసిటీ కేసు | SC ST Atrocity Case Filed On TDP Ex MLA Raavi Venkateswara Rao | Sakshi
Sakshi News home page

టీడీపీ మాజీ ఎమ్మెల్యేపై అట్రాసిటీ కేసు నమోదు

Nov 8 2020 6:05 PM | Updated on Nov 8 2020 8:41 PM

SC ST Atrocity Case Filed On TDP Ex MLA Raavi Venkateswara Rao - Sakshi

సాక్షి, కృష్ణా : టీడీపీ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. నా ఇల్లు- నా సొంతం కార్యక్రమం పేరుతో మల్లాయపాలెం పంచాయతీ పరిధిలో నిర్మాణంలో ఉన్న టీడ్కో గృహల వద్ద టీడీపీ నేతలు వివాదానికి దిగారు. కోవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించి ప్రభుత్వ ఆధీనంలో ఉన్న గృహాల వద్దకు టీడీపీ నేతలు భారీ సంఖ్యలో వచ్చి గొడవకు దిగారు. సైట్‌ ఇంజనీర్లుగా పని చేస్తున్న తలారి గోపి, వెంగళ నాగేంద్ర బాబులను కులం పేరుతో దూషిస్తూ బెదిరింపులకు దిగారు. దీంతో సైట్‌ ఇంజనీర్లు ఇద్దరు రావి వెంకటేశ్వరరావుతో పాటు మరో ముగ్గురిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నలుగురిపై ఎస్సీ , ఎస్టీ కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement